తెలంగాణలో రెడ్, ఆరంజ్,గ్రీన్ జోన్ లు ఇవే, Red Orange green zones in TS

 దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి ఆధారంగా రెడ్ జోనన్లు , ఆరెంజ్ జోన్లను , గ్రీన్లను ఖరారు చేసింది . Red Orange green zones in TS రెడ్ జోన్లను రెండు భాగాలుగా విభజించి హాట్ స్పాట్ జిల్లాలు , హాట్‌స్పాట్ క్లస్టర్ జిల్లాలుగా విభజించింది .

 మొత్తం 170 జిల్లాలను కరోనా హాట్‌స్పాట్ గా  కేంద్రం ప్రకటించగా , తెలంగాణకు సంబంధించిన మొత్తం 9 జిల్లాలు ఇందులో ఉన్నాయి . Red Orange green zones in TS సంబంధించిన జాబితాను కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతిసుడాన్ రాష్ట్ర ప్రభుత్వానికి బుధవారం సాయంత్రం పంపారు .

 రెడ్ జోన్ జిల్లాలు ::

తెలంగాణలోని 28జిల్లాల్లో కేసులు నమోదు కాగా , ఇందులో 9 జిల్లాలను హాట్‌స్పాట్లుగా కేంద్రం ప్రకటించింది .

 హైదరాబాద్ , నిజామాబాద్ , వరంగల్ అర్బన్ , రంగా రెడ్డి , జోగులాంబ గద్వాల , మేడ్చల్ , కరీంనగర్ , నిర్మల్ జిల్లాలు ఉండగా , హాట్‌స్పాట్ క్లస్టర్ జిల్లాగా నల్లగొండ ను ఎంపిక చేశారు . రెడ్ జోనల్లో విస్తృతి ఎక్కువగా ఉన్న వాటిని హాట్‌స్పాట్ జిల్లాలుగా , కేసుల సంఖ్య అధికంగా ఉన్నా విస్తృతి తక్కువగా ఉన్న జిల్లాలను హాట్‌స్పాట్ క్లస్టర్లుగా కేంద్రం గుర్తించింది . హాట్ స్పాట్ జిల్లాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా కేంద్రం సూచించింది .

ఆరంజ్ జోన్ జిల్లాలు ::

  తెలంగాణలో కరోనా వైరస్ కేసులు నమోదైనా పరిస్థితి నిలకడగా ఉన్న 19 జిల్లాలను , జిల్లాలు ఆరెంజ్ జోన్లో కేంద్రప్రభుత్వం చేర్చింది . వీటిని నాన్ హాట్ స్పాట్ జిల్లాలుగా ప్రకటించింది .

 సూర్యాపేట , ఆదిలా బాద్ , మహబూబ్ నగర్ , కామారెడ్డి , వికారాబాద్ , సంగా రెడ్డి , మెదక్ , ఖమ్మం , భద్రాద్రి కొత్తగూడెం , జగిత్యాల , జనగాం , జయశంకర్ భూపాలపల్లి , కుమరంభీం ఆసిఫా బాద్ , ములుగు , పెద్దపల్లి , నాగర్‌కర్నూల్ , మహబూబాబా ద్ , రాజన్న సిరిసిల్ల , సిద్దిపేట జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి .

గ్రీన్ జోన్ జిల్లాలు::

 గ్రీన్ జోన్ గా ఐదు జిల్లాలు, ఒక్క కేసు కూడా నమోదుకాని ఐదు జిల్లాలు గ్రీన్ జాబితాలో ఉన్నాయి . ఈ జిల్లాలకు ఈ నెల 20 తర్వాత ప్రత్యేకమినహాయింపులు ఇవ్వనున్నారు . ఏయేమినహాయి ంపులు ఇవ్వనున్నారు . మొత్తం గేట్లు ఎత్తేస్తారా అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది .

 యాదాద్రి భువనగిరి , వరంగల్ రూరల్ , వనపర్తి , నారాయణపేట , మంచిర్యాల జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి . మాస్క్ , సామాజిక దూరం పాటించడం తప్పనిసరి కాగా , దైనందిన జీవనానికి , పనులకు , వృత్తులకు ఇబ్బందులు లేకుండా సడలింపులు ఉండే అవకాశముంది . జిల్లా పరిధిలో ప్రైవేట్ రవాణాకు కూడా అనుమతించే అవకాశాలు ఉన్నాయి .

 14రోజులు కొత్త కేసులు రాకుంటే 14 రోజుల పాటు కొత్త కేసులు రాకుంటే హాట్‌స్పాట్ రెడ్ జోన్ జిల్లాలు , ఆరెంజ్ జోన్లోకి మారనున్నాయి . ఆరెంజ్ జోనల్లో ఉన్న వారికి కొన్ని సడలింపులు ఉంటాయి . ఆరెంజ్ జోన్లలో ఉన్న జిల్లాల్లో 14 రోజులు కొత్త కేసులు రాకుంటే గ్రీజోనల్లోకి వచ్చే అవకాశముంది .

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మార్చి 24 తర్వాత కొత్త కేసు ఒకటి కూడా నమోదుకాకపోగా , కేంద్ర ఆరోగ్యశాఖ కార్శదర్శి జిల్లా కలెక్టర్ ఎంవీరెడ్డిని అభినందించారు . ఇలాగే ఉంటే త్వరలో ఈ జిల్లా గ్రీజోన్లోకి వచ్చే అవకాశముంది . ఒక్క కేసుతోనే అనేక జిల్లాల్లో కట్టడి చేశారు . ఆయా జిల్లాలు గ్రీలోకి వచ్చే అవకాశముంది .

Related Articles

Back to top button