పది పరీక్షలు జరిగేది ఎపుడు, 10th class exams in Telangana
10th class exams in Telangana ::
తెలంగాణ రాష్ట్రంలో మిగిలిపోయిన ఎస్ఎస్ సీ పరీక్షలు జరుగుతాయా ? లేదా ? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి . 10th class exams in Telangana ఎస్ఎస్ సీ పరీక్షలు ఇప్పటికే రెండు సబ్జెక్టులు పూర్తి అయిన విషయం తెలిసిందే . తెలుగు , హిందీ పరీక్షలు ముగిశాయి . మరో 4 సబై క్టుల పరీక్షలు జరిగాల్సి ఉంది .
ఈ 4 సబ్జెక్టులకు సంబంధించి 8 పరీక్షలు జరగాల్సి ఉంది . వాటి నిర్వహణకు కనీసం 11 రోజుల సమయం అవసరం అవుతుంది . అయితే దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో దేశంతోపాటు , రాష్ట్రంలోనూ ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే .
లాక్ డౌన్ ఎత్తివేసేది ఎపుడు::
రాష్ట్రంలో కరోనా కట్టడి జరిగితే ఏప్రిల్ 14 తరువాత లా డౌన్ ఎత్తేసే అవకాశం ఉంటుంది . లేకపోతే మరో వారం లేదా 10 రోజులపాటు లా డౌన్ కొనసాగే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు .
లాక్ డౌన్ కొసాగితే ఏప్రిల్ చివరివారంలో 10th class exams in Telangana ప్రారంభమై మే మొదటి వారంలో పూర్తి అవుతాయి . పరీక్షలు ముగిసిన అనంతరం మూల్యాంకనం , పరిశీలన , ఫలితాల వెల్లడికి కనీసం నెల రోజులు తగ్గకుండా సమయం అవసరం ఉంటుంది . అంటే పరీక్షలు మే మొదటి వారంలో పూర్తి అయితే జూన్ మొదటి వారంలో ఫలితాలు వెల్లడి అవుతాయి.
ఆ తరువాత మరో నెల రోజులపాటు అడ్వాన్స్డ్ పరీక్షలు , ఫలితాలు తదితర అంశాలు కొనసాగే అవకాశం ఉంటుంది . అంటే జూలై నెలాఖరు వరకు అడ్వాన్స్డ్ ఫలితాలు వెలువడే అవకాశం ఉంటుంది . ఆగస్టు నెలలో అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది . అయితే పరీక్షల నిర్వహణ అనంతరం మూల్యాం కనం , ఫలితాల వెల్లడిపై ప్రభుత్వం , పాఠశాల విద్యశాఖ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
ఫలితాల విడుదల ఆలస్యం::
గత ఏడాదిలో ఇంటర్ ఫలితాల వెల్లడి సందర్భంగా జరిగిన అవకతవకల నేపథ్యంలో గత ఏడాదిలోనే మూల్యాంకనం అనంతరం ఫలితాల వెల్లడికి 5 అంచెల్లో జాగ్రత్తలు తీసుకున్నారు . ఈ సారి కూడా అదే పద్దతిలో ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంటుంది కాబట్టి మూల్యాంకనం , ఫలి తాల వెల్లడికి నెల రోజుల్లో కాకుండా నెలా 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుంది . ఇలా అయితే ఇంటర్ అడ్మిషన్లు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది .
ఎస్ఎస్ సీ వార్షిక పరీక్షల నిర్వహణ లేకుండా విద్యార్థులను ఉత్తీర్ణులను చేసే అవకాశాలపై కూడా ప్రభుత్వం ఆలోచించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది . ఇప్పటికే విద్యార్థులు వార్షిక పరీక్షల కంటే ముందుగా రాసే ప్రీ ఫైనల్ పరీక్షలను రాసి ఉన్నారు . వాటి ఫలితాలను కూడా ఇప్పటికే ప్రకటించారు .
వాటితోపాటు ఎస్ఎస్ సీ విద్యార్థులకు నమ్మేటీవ్ అసెస్మెంట్ – 1 పరీక్షలను కూడా నిర్వహించి ఉన్నారు . విద్యార్థులకు వార్షిక పరీక్ష లను నిర్వహించకపోతే ఈ రెండు పరీక్షల్లో విద్యార్థులు పొందిన మార్కుల సరాసరితో వారికి మార్కులను ఇస్తే ఎలా ఉంటుందని వాటి ఆధారంగానే గ్రేడ్ పాయింట్ యావరేజ్ జీపీఏ ) ను నిర్ణయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేసే అవ కాశం ఉంటుందని కొందరు విద్యారంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు .