తల్లీ ఒడిలోనే మృతి చెందిన బాలుడు, child died due to lack of ambulance
లాక్ డౌన్ సమయంలో child died due to lack of ambulance లేకపోవడంతో సకాలంలో వైద్యం అందక మూడేళ్ల బాలుడు మృతి చెందాడు .
పాట్నాకు 48 కిలోమీటర్ల దూరంలోని జెహనా బాయ్ బాలుడి తల్లితండ్రులు అస్వస్థతకు గురయిన బాలుణ్ణి తీసుకుని సుదూర ఆనువత్రికి నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది .
అయినప్పటికీ అక్కడి వైద్యులు ఇక్కడ కాదని , జిల్లాకు వెళ్లాలని , అక్కడినుంచి పాట్నాకు వెళ్లాలని బాలుణ్ణి చేర్చుకోలేదు . బాలుణ్ణి హాస్పిటల్ లో చేర్చుకునేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు.
లాక్ డౌన్ కావడంతో టెంపోలు కూడా వారికి అద్దెకు లభించలేదు . ప్రభుత్వం అంబులెన్స్ child died due to lack of ambulance ఏర్పాటుచేయకపోవడంతో మూడేళ్లబాలుడు మృతిచెందాడు . చిన్నారి మృతదేహాన్ని ఆ మాతృమూర్తి తన ఒడిలో ఉంచుకుని చేసిన ఆక్రందనలు సోషల్‌మీడియాను కదిలించాయి.
వైరల్ గా సాగిన ఈవిడియోతో బీహార్ వైద్య విధానం తీరుతెన్నులను తీవ్రంగా విమర్శించారు . బాలుడు చివరకు తల్లి ఒడిలోనే మృతిచెందాడు . బాలుడి తండ్రికూడా పక్కనే నిల్చుని అచేతనుడైపోయాడు .
కొందరు సాయం చేస్తామని ముందుకురాగా ఇవుడు ఏసాయం అవసరం లేదని తమకు ఇపుడు అంబులెన్స్ అవసరం కూడా లేదని తండ్రి గిరిరాజ కుమార్ ఏడువు ఆపుకోలేకపోయాడు . ముందు డాక్టర్లకు చూపించామని , పరిస్తితి విషమించడంతో టెంపోను తీసుకుని జెహనాబాదు అతికష్టం పై వచ్చామన్నారు .
అక్కడ పాట్నా మెడికల్ హాస్పిటల్ వారు ఇంకో హాస్పిటల్ కు వెళ్లాలన్నారని , అయితే తమకు అంబులెన్స్ ఇవ్వలేదని , ఈ నిర్లక్ష్యం వల్లనే తన వారసుడు చనిపోయాడని అన్నారు.
లాక్ డౌన్లో జీవన్మరణ సమస్యల్లో తమకు ఎలాంటి సౌకర్యం లభించలేదన్నారు . వైద్యం అందక తల్లి ఒడిలోనే తనువు చాలించిన మూడేళ్ల బాలుణ్ణి చూసి ఆతల్లి చేస్తున్న ఆక్రందనలకైనా బీహార్ ప్రభుత్వం కళ్లు తెరవాలని సోషల్ మీడియాలో ట్వీట్లు వెల్లువెత్తాయి.
జెహనాబాద్ యంత్రాంగం కళ్లు తెరిచింది . మేనేజర్‌ను సస్పెండ్ చేసి కొందరు వైద్యులకు నోటీసులు జారీచేసింది . రోగులకు తక్షణమే ఆంబులెన్స్ సౌకర్యం కల్పించాలని హెచ్చరించినట్లు జిల్లా మేజిస్ట్రేట్ నవీన్ కుమార్ తెలిపారు .