ఓకరికి బదులు మరో కరోనా సోకిన వ్యక్తి డిశ్చార్జ్, chest hospital doctors negligence
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ రోగులకు చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందిపై ప్రశంసలు కురుస్తుంటే, చెస్ట్ ఆసుపత్రి చేసిన నిర్వాకం chest hospital doctors negligence వెలుగులోకి వచ్చింది . ఒకరికి బదులు మరొకరిని డిశ్చార్ చేసి నాలుక కరచుకున్నారు.
డిశ్చార్ చేసిన వ్యక్తికి కరోనా ఇంకా తగ్గనే లేదు . ఆయన ఎవరో కాదు ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన డీఎస్పీ షేక్ అలీ . తనకు తగ్గిందని ఆనందంలో ఉన్న షేక్ ఆలీని మరలా ఆసుపత్రికి రప్పించారు . దీంతో మరలా కొత్తగూడెం జిల్లాలో భయాందోళన పరిస్థితి నెలకొంది . ఇద్దరి పేర్లు ఒకేలా ఉండడంతో చెస్ట్ ఆసుపత్రి కన్ ఫ్యూజ్ అయ్యారు .
తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండడంతో ఆసుపత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు . చెస్ట్ ఆసుపత్రిలో కూడా ఇదే విధంగా ఏర్పాటు చేసి రోగులకు చికిత్స అందిస్తున్నారు . chest hospital doctors negligence , ఏప్రిల్ 09వ తేదీ గురువారం కొత్తగూడెం డీఎస్పీగా ఉన్న ఎస్ఎం షేక్ ఆలీని డిశ్చార్డ్ చేశారు . ఆసుపత్రి వైద్యులు.
దీంతో ఆయన సొంతూరు కొత్తగూడెంకు వెళ్లిపోయారు . మరోసారి కేస్ షీట్లను సిబ్బంది పరిశీలించగా అందులో షాకింగ్ న్యూస్ బయటపడింది . తాము డిశ్చార్జ్ చేయాల్సింది డీఎస్పీని కాదని వేరే వ్యక్తిని అని తేల్చారు . వెంటనే ఈ విషయాన్ని డీఎస్పీ ఆలీకి తెలియచేశారు .
వ్యాధి నయం అయ్యిందని సంతోషపడిన ఆలీ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైంది . వెంటనే హైదరాబాద్ చెస్ట్ ఆసుపత్రికి వచ్చారు . పరీక్షల్లో నెగటివ్ అని తేలింది . ఇతడిని గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం . దీంతో తాము చేసిన తప్పు తెలుసుకున్నారు . అసలు ఆలీని డిశ్చార్జ్ చేయాల్సి ఉంది .
మరోసారి పోలీసులు , వైద్యులు రంగంలోకి దిగారు . డీఎస్పీ ఎక్కడెక్కడ తిరిగారు ? ఎవరితో మాట్లాడారు అనే దానిపై ఆరా తీస్తున్నారు . దీనిపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
లండన్ నుంచి వచ్చిన తన కొడుకుని క్వారంటైన్ చేయకుండా బయటకు పంపినందుకు కొత్తగూడెం డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది . లండన్ నుంచి వచ్చిన డీఎస్పీ కుమారుడికి కరోనా పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది .
డీఎస్పీ కుటుంబ సభ్యులందరినీ క్వారంటైన్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు . ఇందులో డీఎస్పీతో పాటు . . ఇంటిలో పనిచేసే వంట పనిమనిషికి కూడా కరోనా లక్షణాలు కనిపించాయి . డీఎస్పీ కొడుకు లండన్లో విద్యాభ్యాసం చేస్తున్నాడు . మార్చి 18న లండన్ నుంచి హైదరాబాద్ తిరిగొచ్చాడు .