డాక్టర్ గా మారిన ప్రధాని, Ireland PM became doctor

 కరోనా వైరస్ వ్యాప్తి వేళ Ireland PM became doctor డాక్టర్ విధుల్లో ఐర్లాండ్ ప్రధాని ఒక దేశానికి ప్రధానమంత్రి . ఆయన స్వతహాగా వైద్యుడు . వైద్య విద్యను అభ్యసించిన ఆయన రాజకీయాల్లోకి రావడానికి ముందు ఏడు సంవత్సరాలు డాక్టర్‌గా పనిచేశారు .

 41 సంవత్సరాల లియో వరద్కర్ కరోనా వైరస్ సంక్షోభ సమయంలో రోగులకు సహాయం చేయడానికి వారానికి ఒక షిఫ్ట్ పనిచేస్తారని ఎఎఫ్ సోమవారం తెలిపింది . దేశ ప్రధాని అయిన డా . లియో వరద్కర్ మెడికల్ రిజిస్టర్ నుండి 2013లో పేరు తొలగించారు . ఇప్పుడు తిరిగి వైద్యం చేయడానికి తిరిగి వైద్యునిగా తన పేరు నమోదు చేసుకున్నారు .

 Ireland PM became doctor ప్రాక్టీసు పరిధిలో వున్న ప్రాంతాలలో వారానికి ఒక సెషన్ తన సేవలను అందించారు . వరద్కర్ ఫోన్ ద్వారా అసెస్మెంటకు సహాయం చేస్తున్నట్లు సమాచారం . వైరస్ బారిన పడిన ఎవరైనా అంటువ్యాధులను నివారించడానికి ఫోన్ ద్వారా మొదట అంచనా వేస్తారు .

 వరద్కర్ కుటుంబం , స్నేహితులు చాలామంది వైద్యరంగంలో పనిచేస్తున్నారు అని ప్రతినిధి తెలిపారు . వరద్కర్ వైద్య కుటుంబం నుండి వచ్చారు . ఆయన తల్లి నర్సు . అతని భాగస్వామి మాథ్యూ బారెట్ , ఇద్దరు సోదరీమణులు మరియు వారి భర్తలు కూడా ఆరోగ్య సంరక్షణలో పనిచేస్తున్నారు .

 గత నెలలో ఆరోగ్య మంత్రి సైమన్ హారిస్ కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తగినంత వైద్య సిబ్బంది లేక దేశం కష్టపడుతోంది . వైద్య సేవలందించేవారిని రిక్రూట్ చేసుకోవడం ప్రారంభించారు . హెల్త్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్లకు 60 , 000 కంటే ఎక్కువ అప్లికేషన్లను అందుకుంది . ఐర్లాండ్ లో 4,994 కరోనా వైరస్ కేసులు నమోదయ్యా యి , అందులో ఇప్పటివరకు 158 మంది మరణించారు . 

Related Articles

Back to top button