తెలంగాణలో ఒకే రోజు 75 కరోనావైరస్ కేసులు, 75 corona New cases in TS

తెలంగాణ రాష్ట్రంలో మాటువేసిన కరోనా మహమ్మారి శుక్రవారం ఒక్కసారిగా బుసలు కొట్టింది . ఢిల్లీ మర్కజ్ కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రానికి వచ్చినవారి ద్వారా 75 corona New cases in TS వైరస్ విస్తృతంగా వ్యాపించి గడగడలాడిస్తోంది.

  నాలుగు రోజులుగా ఈ కేసుల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతూండగా శుక్రవారం మరీ విజృంభించడం ఆందోళన రేపింది . గడచిన 24 గంటల్లో 75 corona New cases in TS 75 మందికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ కాగా ఇప్పటికే దీనిబారిన పడి చికిత్స పొందుతున్న ఇద్దరు ప్రాణాలు కోల్పో యారు . మొత్తంమీద రాష్ట్రంలో కరోనా సోకిన రోగుల సంఖ్య 229కు చేరుకోగా మృతుల సంఖ్య 11కు చేరుకుంది.

 శుక్రవారం మరణించిన వారిలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గానికి. చెందిన ఒక మహిళ , సికింద్రాబాద్ కు చెందిన ఒక వ్యక్తి ఉన్నారని వైద్యారోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి . ఒకవైపు కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ కోలుకుంటున్న వారి సంఖ్య కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండటం కాస్తంత ఊరట కలిగిస్తోంది.

 శుక్రవారం 15మందికి వ్యాధి నయం కావడంతో వారిని ఇంటికి పంపించామని , ఇప్పటిదాకా కరోనానుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 32 మందికి చేరుకుందని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది . రాష్ట్రంలోని వివిధ ఐసోలేషన్ వార్డుల్లో 186మంది చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది . తాజాగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఉన్నాయి .

 ఆ జిల్లాలో ఒకే రోజు 23 మందికి నిర్ధారణ కావడం అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది . ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైద్యారోగ్యశాఖా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు కూడా అధికారులు వెల్లడించారు . నల్గొండ జిల్లాలో ముగ్గురికి , కామారెడ్డిలో ఇద్దరికి , మెదక్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన మరో ముగ్గురికి కరోనా సోకింది . ఆ మర్కజ్ నుంచి మహమ్మారి వ్యాప్తి శుక్రవారం నమోదయిన పాజిటివ్ కేసులన్నీ ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారితోపాటు వారి ద్వారా సంక్రమించిన వారే ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

  ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి కోసం జల్లెడపట్టి గత రెండు రోజుల్లో 1000 మందిని గుర్తించారని , వారి నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షలు జరిపిస్తున్నామని , ఇప్పటికి 75మందికి పాజిటివ్ గా తేలిందని , ఇంకా కేసుల సంఖ్య పెరిగే అవకాశముందని సంబంధిత అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి.

 తాజా పరిణామాలతో ఉలిక్కిపడ్డ అధికారులు నష్ట నివారణా చర్యలకు ఉపక్రమించారు . వచ్చే రెండు , మూడు రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరగ వచ్చన్న సంకేతాలు వెలువడుతుండడంతో వారికి చికిత్స జరిపించేందుకు అవసరమైన ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు .

Related Articles

Back to top button