చైనాలో మరో కొత్త వైరస్, ఒకరు మృతి, New virus spreading in China

కరోనా వైరస్ ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది . గతేడాది డిసెంబర్ లో చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైరస్ కొన్ని నెలల్లోనే ప్రపంచ వ్యాప్తమైంది . New virus spreading in China చైనా వైద్యులు ఎంతో కష్టపడి కరోనాపై విజయం సాధించారు . 

హుబేయ్ ప్రావిన్స్ తో పాటు వుహాన్ వంటి నగరాల్లో కొన్ని నెలలుగా విధించిన లాక్ డౌనను చైనా ప్రభుత్వం క్రమంగా ఎత్తేస్తోంది . సరిహద్దు ద్వారాలు తెరుస్తోంది . హమ్మయ్యా .. కరోనా వైరస్ అదుపు లోకి వచ్చిందని ఊపిరి పీల్చుకుంటున్న సమయం లోనే మరో New virus spreading in China కొత్త రకం వైరస్లో చైనాలో పుట్టు కొచ్చింది . 

 ఓ వ్యక్తిని కూడా ఈ కొత్త రకం వైరస్ కబళించింది . దానిపేరే ‘ హంటా వైరస్  అవునండి .కరోనా వైరస్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న డ్రాగెన్ మెడకు మరో వైరస్ చుట్టుకుంది . మరో 32 మందికి కొత్త రకం ‘ హంటా వైరస్ ‘ లక్షణాలు కనిపించాయి . 

ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు . చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ ఈ విషయాన్ని వెల్లడించింది . అదే విధంగా చైనాలోని ‘ వ్యాధుల నియంత్రణ , నివారణ సెంటర్ ‘ హంటా వైరసకు సంబంధించిన పలు వివరాలు వెల్లడించింది . కరోనా వైరస్ లక్షణాలతో  ఇప్పటికే 81వేల మంది రోగులు చికిత్స పొందు తున్నారు 3277 మంది చనిపోయారు . 

 కరోనా కారణంగా మరణాల సంఖ్యతో పాటు వ్యాప్తి తగ్గినా కొత్త రకం వైరస్ మళ్లీ విజృంభిస్తుండటంతో చైనాకు తలనొప్పిగా మారింది .  చైనాలోని యునన్ లో ఓ వ్యక్తిలో హంటా వైరస్ లక్షణాలతో సోమవారం మృతి చెందాడు . షాండాంగ్ ప్రావిన్సు వెళ్తున్న అతడు  హంటా వైరతో మృతి చెందినట్టు చైనా అధికారపత్రిక గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది .

అతడు ప్రయాణించిన బస్సులోని మరో 32 మంది ప్రయాణికులకు కూడా పరీక్షలు నిర్వహించినట్టు తెలిపింది . వైరస్ లక్షణాలు వెలుగులోకి వచ్చిన గంటల వ్యవధిలోనే సదరు రోగి ప్రాణాలు కోల్పోయాడు .

‘ హంటా ‘ వైరస్ అంటే ఏమిటి, ఎలా సోకుతుంది??  

హంటా వైరసను ఆండీస్ వైరస్ అని కూడా అంటారు . ఇది ఎక్కువగా ఎలుకల ద్వారా సంక్రమిస్తుంది . ఎలుకల నుంచి వచ్చిన వైరస్ కారణంగా వ్యాధి ప్రబలిందని నిర్ధారించారు . అందువల్ల దానికి హంటావైరస్ అని పేరు వచ్చింది . దీని గురించి భయపడాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు . ఉత్తర , మధ్య , దక్షిణ అమెరికాలో ఇది ఎక్కువగా వ్యాపిస్తుంది . కొన్నేళ్ల కిందట అమెరికాలోని హంటా నదీ తీరంలో సైనికులు గుడారాలు వేసుకున్నారు . అక్కడ ఎలుకలు ఎక్కువగా ఉన్నందున వాటి ద్వారా వచ్చిన వైరస్ సైనికులకు సంక్రమించింది .

Related Articles

Back to top button