కరీంనగర్ లో మరో కరోనా వైరస్ కేసు, Another positive case in Karimnagar
Another positive case in Karimnagar అధికారుల అనుమతితో బయటకు వెళ్ళాలని , అనవసరంగా రోడ్లపైకి రావడం మానుకోవడంతో పాటూ స్వీయ నిర్బంధం పాటించాలని సూచించారు .
విదేశీయులు పర్యటించిన ప్రాంతాల్లో ఇంటింటా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వైద్య బృందాలు వస్తాయని , ప్రజలు సానుకూలంగా స్పందించి సదరు బృంధాలకు సహకారం అందించాలని కోరారు . ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లయితే ప్రాణాలు కోల్పోవాల్సిన దుర్భర పరిస్థితులు ఏర్పడుతాయని హెచ్చరించారు .
చైనా , ఇటలీ , అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెంది వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్న పరిణిమాలను ఒక గుణపాఠంగా గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు . ఇళ్ళలో కూడా మనిషికి మనిషికి మధ్యలో రెండు మీటర్ల దూరాన్ని పాటించాలని తెలిపారు .
ప్రజలకు అవగాహన కల్పించడం , ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనా వ్యాప్తిని నిరోధించవచ్చన్నారు . వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో నిర్లక్ష్యం వ్యవహరించినట్లయితే ఆ వైరస్ మనకు సోకినట్లయితే మనపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమిటనే విషయాన్ని ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు .
రెడ్ జోన్లుగా ప్రకటించిన ప్రదేశాల్లో ప్రజలకు సేవలందించేందుకు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు , వాహనాలకు మాత్రమే అనుమతి ఉందని , ఇతరులు ప్రస్తుతం ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితుల్లో బయటకు వెళ్ళకూడదని తెలిపారు .
కరోనా వైరస్ లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తులకు ఇప్పటి వరకు 80 మందిని గుర్తించి ఆసుపత్రులకు తరలించడంతో పాటూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్వారంటైన్లకు తరలించి ప్రత్యేక చికిత్స అందించడం జరుగుతుందన్నారు . బయటి దేశాల నుండి వచ్చిన వారిని గుర్తించి స్టాపింగ్ వేయడం జరిగింది.
కొందరు స్టాంపింగ వేయించుకోకుండా సంచరిస్తున్నట్లు సమాచారం అందుతుందని తెలిపారు . విదేశాల నుండి వచ్చిన స్టాపింగ్ వేయించుకోవడంతో పాటూ కరోనా వైరస్ లక్షణాలు కలిగి ఉండి సంచరిస్తున్న వారికి సంబంధించిన సమాచారాన్ని పోలీసు , వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పాటూ తమకు నేరుగా సెల్‌ఫోన్ ద్వారా సమాచారం అందించినా సత్వరం స్పందించి చర్యలు తీసుకుంటామని చెప్పారు .
ఎక్కువ మంది జమకూడే ప్రాంతాలైన వివిధ మతాలకు చెందిన ప్రార్ధనా స్థలాలను కూడా మూసి ఉంచాలని కోరారు . ఈ వైరస్ లక్షనాలు కలిగి ఉన్న Another positive case in Karimnagar వ్యక్తులు స్వచ్చందంగా ముందకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు .
పోలీసు కమీషనర్ విబి కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నామని , ఇంత ఉష్ణోగ్రతలో కూడా ఈ వైరస్ సోకుతుందా అనే భ్రమలో ఎక్కువ మంది ఉన్నారన్నారు . 30 ఏళ్ళ వయస్సులోపు వారికి కూడా ఈ వైరస్ సోకిందనే విషయాన్ని గుర్తించాలన్నారు .
ప్రయాణీకులను చేరవేసే ఆటోలు , ట్యాక్సీలు తిరగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు . ప్రయాణికులను చేరవేసేందుకు కనిపించే వాహనాలను వెంటనే సీజ్ చేయడంతో పాటూ సదరు వాహనదారులపై కేసులను నమోదు చేస్తామని హెచ్చరించారు .
ఐదుగురి కన్నా ఎక్కువ మంది ఒక చోట జమకూడి ఉండకూడదని , ప్రస్తుతం 144 సెక్షన్ అమల్లో ఉందని , జన సమూహాన్ని పోలీసులు వివిధ రకాల చర్యలతో చెదరగొట్టడం జరుగుతుందని తెలిపారు .