తెలంగాణలో కరోనా ఉగ్ర రూపం, COVID19 +ve cases in Telangana
కరోనా ఉధృతి రోజు రోజుకూ పెరుగుతుందే కాని తగ్గడం లేదు . COVID19 +ve cases in Telangana గడిచిన నాలుగు నెలలుగా అడపా దడపా మాత్రమే రోజువారీ పాజిటివ్ కేసులు నమోద య్యాయి . కాని ప్రస్తుతం ప్రతీ రోజూలు 2 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరిని కలవరపెడుతోంది .
ఈ ఏడాది మార్చి 2 న తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది . అప్పటి నుంచి దాదాపు నాలుగు నెలలుగా ప్రతీ రోజూ కేసుల సంఖ్య పెరుగుతుందే కాని తగ్గడం లేదు . తాజాగా గురువారం 2092 మందికి కరోనా సోకింది . కొత్త కేసులను కలుపుకుని రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 73,050 ను చేరుకుంది . ప్రతీ రోజూ వెయ్యి మందికిపైగా కోవిడ్ -19 బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అవుతున్నారు . గురువారం 1289 మంది వివిధ ఆసుపత్రుల నుంచి కోలుకుని ఇంటికి వెళ్లగా ఇప్పటి వరకు పాజిటివ్ బారిన పడిన వారిలో మొత్తం 52,108 మంది పూర్తిగా కరోనా నుంచి కోలుకున్నారు . కరోనామృతుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగు తుందే కానీ తగ్గడం లేదు . గడిచిన 24 గంటల్లో మరో 18 మంది కరోనా బారిన పడి మృతి చెందారు . దీంతో మృతుల సంఖ్య 589 కు చేరుకుంది .
COVID19 +ve cases in Telangana ::
రాష్ట్రంలో మరణాల సంఖ్య లో పెరుగుదల ఉన్నప్పటికీ మొత్తం పాజిటివ్ కేసుల్లో మృతి చెందుతున్న వారి సంఖ్య 0.80 శాతంగానే ఉంది . మరోవైపు కరోనా బారిన పడుతున్నవారిలో చికిత్స పొందుతూ 71.3 శాతం మంది కోలుకుంటున్నారంటే … కరోనా వైరస్ సోకిన వెంటనే చికిత్స తీసు కుంటూ జాగ్రత్తలు పాటిస్తే ప్రాణాపాయం తప్పు తున్నట్లు స్పష్టమవుతోంది . కోవిడ్ సోకుతుండడంతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య ఏ రోజుకారోజు పెరుగుతోంది . ఇప్పటికీ వివిధ ప్రభుత్వ , ప్రయివేటు ఆసుపత్రుల్లో కోవిడ్ బారిన పడి 20,358 మంది చికిత్స పొందుతున్నారు . హోం క్వారంటైన్ కేంద్రాల్లో 18 , 198 మంది చికిత్స తీసుకుంటున్నారు . కాగా … నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 5,43,489 కు చేరుకుంది .
ఒక్క గురువారమే 21 , 346 మందికి నిర్ధారణా పరీక్షలు నిర్వహించారు . వీరిలో 1550 మంది పరీక్షా ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది . తాజాగా నమోదైన 2092 పాజిటివ్ కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనివే 585 కేసులు ఉన్నాయి . ఇక ఆదిలాబాద్లో 17 , భద్రాద్రి కొత్తగూడెం 36 , జగిత్యాల 28 , జనగామ 26 , జయశంకర్ భూపాపల్లి 21 , జోగు లాంబ గద్వాల 72 , కామారెడ్డి 28 , కరీంనగర్ 128 , ఖమ్మం 64 , కొమరంభీం ఆసీఫాబాద్ 0 , మహబూబ్ నగర్ 48 , మహబూబాబాద్ 16 , మంచిర్యాల 43 , మెదక్ 18 , మేడ్చల్ మల్కాజిగిరి 126 , ములుగు 27 , నాగర్ కర్నూలు 22 , నల్గొండ 52 , నారాయణపేట 6 , నిర్మల్ 25 , నిజామాబాద్ 91 , పెద్దపల్లి 54 , రాజన్న సిరిసిల్ల 83 , రంగారెడ్డి 169 , సంగారెడ్డి 101 , సిద్ధిపేట 20 , సూర్యాపేట 34 , వికారాబాద్ 9 , వనపర్తి 34 , వరంగల్ రూరల్ 24 , వరంగల్ అర్బన్ 128 .