తెలంగాణలో ఆగని కరోనా మహమ్మారి, COVID19 update Telangana
రాష్ట్రంలో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు . COVID19 update Telangana కరోనా పాజిటివ్ కేసులు 80 వేలకు చేరుకున్నాయి . కొత్తగా మరో 1256 మందికి కరోనామహ మ్మారి సోకింది . ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెనను విడుదల చేసింది . తాజాగా నమోదైన కేసులను కలుపుకుంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 80,751 కు చేరుకుంది . కరోనా సోకడంతో చికిత్స పొంది 1587 మంది డిశ్చార్జి అయి ఇళ్లకు వెళ్లా రు . ఇప్పటి వరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 57,585 గా ఉంది . మరో 10 మందిని కరోనా మహమ్మారి పొట్టన బెట్టుకుంది . శనివారం నాటి కరోనా మృతుల సంఖ్యను కలుపుకుంటే ఇప్పటి వరకు తెలంగాణలో 637 మంది కరోనాతో మృతి చెందినట్లు గణంకాలు చెబుతున్నాయి .
COVID19 update Telangana ::
1256 పాజిటివ్ కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 389 కేసులు నమోదయ్యాయి . ఇటీవలి కాలంలో రోజువారీ పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 500 కంటే తక్కువగా నమోదవడం ఇది వరుసగా మూడో రోజు . జిల్లాల వారీగా నమోదైన పాజిటివ్ కేసులు ఇలా ఉన్నాయి … ఆదిలాబాద్ 63, భద్రాద్రి కొత్తగూడెం 7 , జగిత్యాల 13 , జనగామ 20 , జయశంకర్ భూపాలపల్లి 6 , జోగులాంబ గద్వాల 14 , కామారెడ్డి 8 , కరీనంగర్ 73 , ఖమ్మం 8 , కొమరంభీం ఆసీఫాబాద్ 0 , మహబూబ్ నగర్ 21 , మహబూబాబాద్ 19 , మంచిర్యాల 13 , మెదక్ 9 , మేడ్చల్ మల్కాజిగిరి 34 , ములుగు 3 , నాగర్ కర్నూలు 38 , నల్గొండ 58 , నారాయణపేట 12 , నిర్మల్ 19 , నిజామాబాద్ 33 , పెద్దపల్లి 23 , రాజన్న సిరిసిల్ల 31 , రంగారెడ్డి 86 , సంగారెడ్డి 74 , సిద్ధిపేట 45 , సూర్యాపేట 20 , వికారాబాద్ 6 , వనపర్తి 12 , వరంగల్ రూరల్ 11 , వరంగల్ అర్బన్ 67 , యాదాద్రి భువనగిరి 3 .