పోలీసులను చూసి గుండె పోటుతో వ్యక్తి మృతి, man died with heart attack
ఓ కానిస్టేబుల్ అత్యుత్సాహంతో man died with heart attack మృతి చెందిన ఘటన శుక్రవారం తుళ్ళూరు మండలం రాయపూడి గ్రామంలో చోటుచేసుకుంది . స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం లాక్ డౌన్ నేపథ్యంలో గ్రామంలో రోడ్లపై తిరుగుతున్నారని , రాయపూడిలోని హై స్కూల్ వద్ద పిల్లలు గుంపులుగా ఉండి పబ్లి , క్రికెట్ ఆడుతున్న సమాచారంతో తుళ్ళూరు పోలీసులు హై స్కూల్ వద్దకు చేరుకున్నారు.
పోలీసుల్ని చూసి పిల్లలు పరిగెత్తుతూ పోలీసులు వస్తున్నారని కేకలు వేశారు . ఇంతలో పొలాల్లో ఉన్న కొంతమంది పెద్దవాళ్ళు , విని పరుగులు తీశారు . పోలీసులు వస్తున్నారన్న భయంతో పొలాల్లోకి పరుగు తీస్తూ , రాయపూడి గ్రామానికి చెందిన షేక్ జాఫర్ ( 55 ) గుండెపోటుతో మృతి చెందాడు.
కానిస్టేబుల్ అత్యుత్సాహం వలనే man died with heart attack తో చనిపోయాడని స్థానికులు ఆరోపిస్తున్నారు . విషయం తెలుసుకున్న సీఐ శరత్ బాబు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని గమనించి కుటుంబ సభ్యులతో మాట్లాడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అమరావతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు .
వ్యక్తి మృతికి పోలీసులకు ఎటువంటి సంబంధం లేదు అని ఓఎస్పీ శ్రీనివాస్ రెడ్డి జరిగిన ఘటనపై డీఎస్పీ శ్రీనివాస రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రాయపూడి శివారులో పాఠశాల వద్ద యువకులు గుంపులుగా ఉన్నారన్న సమాచారంలో పోలీసులు సదరు ప్రాంతానికి వెళ్లారన్నారు . దీంతో యువకులు పోలీసులు వచ్చారంటూ పెద్ద అరుపులు అరుస్తూ వెళ్లినట్లు తెలిపారు.
అదే సమయంలో అక్కడ చెట్ల కింద కూర్చున్న కొంత మంది భయంతో పొలాల్లోకి పరిగెత్తారని , వారిలో షేక్ జాఫర్ అనే వ్యక్తికి కంగారులో గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిపారు . వ్యక్తి మృతికి పోలీసులకు ఎటువంటి సంబంధం లేదన్నారు.
పోలీసుల మీద తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు . అనంతరం షేక్ జాఫర్ తో పొలాల్లోకి పరుగు పెట్టిన కయ్యూమ్ ఖాన్ మాట్లాడుతూ పిల్లలు అరవడంతో కంగారులో పొలాల్లోకి పరిగెత్తామన్నారు . షేక్ జాఫర్ హఠాత్తుగా కుప్పకూలిపోయడన్నారు.