మళ్ళీ విజృంభిస్తున్న కరోనా, Huge hike in corona cases

న్యూఢిల్లీ : భారత్ లో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది . Huge hike in corona cases క్రమంగా కొత్తగా నమోదవుతున్న కేసులతో పాటు యాక్టివ్ కేసులు కూడా పెరుగుతున్నాయి . వంద రోజుల తరువాత 24 గంటలవ్యవధిలో 35 వేలకు పైగా పాజిటిన్లు నమోద య్యాయి . క్రితం రోజుతో పోలిస్తే దాదాపు ఆరు వేలకు పైగా కేసులు అధి కంగా రికార్డు కావడం భయాందోళనలను రేపుతోంది . మరణాల సంఖ్య కూడా 150 కిపైగా రికార్డు అయింది . కాగా , బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం నాటికి గడిచిన 24 గంటల్లో 35,871 మందికి పాజి టివ్ వచ్చింది . 102 రోజుల తరువాత ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి .

గత ఏడాది డిసెంబర్ 6 వ తేదీన 36,011 మందికి పాజిటివ్ వచ్చింది . తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1,14,74,605 కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది . కరోనా కారణంగా మరో 172 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,59,216 కు చేరింది . వరుసగా 8 వ రోజూ కూడా యాక్టివ్ కేసులు పెరిగాయి . ప్రస్తుతం దేశంలో 2,52,364 యాక్టివ్ కేసులు ఉన్నాయి . క్రితం రోజు కంటే దాదాపు 18 వేలు పెరిగాయి . మొత్తం కేసుల్లో ఈ సంఖ్య 2.20 శాతంగా ఉంది . జాతీయ రికవరీ రేటు 96.41 శాతానికి పడిపోయినట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది . 24 గంటల వ్యవధిలో 17,741 మంది వైరస్ నుంచి బయట పడగా , రికవరీ సంఖ్య 1,10,63,025 కు పెరిగింది . అయితే మరణాల రేటు 1.39 శాతంగా కొనసాగుతుంది .

Huge hike in corona cases

ఇక దేశంలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 23 కోట్లు దాటింది . పాజిటివిటీ రేటు 4.98 శాతంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది . నిత్యం మిలియన్ మంది జనాభాలో 140 కిపైగా పరీక్షలు చేస్తుండగా , రోజువారీ పాజిటివిటీ రేటు 3.37 శాతంగా ఉంది . ఇప్పటి వరకు దేశంలో 23,03,13,163 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఐసిఎంఆర్ వెల్లడించింది . బుధవారం ఒక్కరోజే 10,63,379 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది . ఇక కొత్త కేసుల్లో 79.54 శాతం కేసులు ఐదు రాష్ట్రాలు మహారాష్ట్ర , పంజాబ్ , కర్నాటక , గుజరాత్ , తమిళనాడులో వెలుగు చూశాయి . మహారాష్ట్రలో అత్యధికంగా 16,620 ( 63.21 శాతం ) , కేరళలో 1,792 , పంజాలో 1,492 కేసులు నమోద య్యాయి . అయితే ఈ ఐదు రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్ , ఢిల్లీ , హర్యానాలో కూడా భారీగా రోజువారీ కేసులు రికార్డు అవుతున్నాయి . కొత్తగా సంభవించిన 172 మరణాల్లో 84.88 శాతం ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నాయి . మహారాష్ట్రలో అత్యధికంగా 84 మంది మృతి చెందగా , పంజాలో 35 , కేరళలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు . 18 రాష్ట్రాలు , యుటిల్లో ఒక్క రోజు వ్యవధిలో ఎలాంటి మరణాలు సంభవించ లేదు .

4 కోట్లకు చేరువలో కరోనా వ్యాక్సినేషన్

ఇదిలా ఉండగా భారత్ లో కరోనా టీకా పంపిణీ కార్యక్రమంలో శరవేగంగా కొనసాగుతోంది . 4 కోట్లకు చేరువులో ఉంది . ఇప్పటి వరకు 6,15,267 సెషన్లలో 3,71,43,255 మందికి వ్యాక్సిన్ డోసులు వేశారు . అందులో 75,68,844 మంది ఆరోగ్య కార్యకర్తలు , 77,16,084 మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు మొదటి డోస్ తీసుకోగా , 46,32,940 మంది ఆరోగ్య కార్యకర్తలు , 19,09,528 మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు రెండవ డోస్ తీసుకున్నారు . వీరే కాకుండా 45 ఏళ్ల దాటి దీర్ఘకాలిక వ్యాధుల గల వారు 24,57,179 మంది , 60 ఏళ్ల దాటిన వృద్ధులు 1,28,58,680 మంది మొదటి డోస్ తీసు కున్నారు . కాగా జనవరి 16 వ తేదీన ప్రారంభమైన వ్యాక్సిన్ పంపిణీ సజా వుగా సాగుతోంది . 61 రోజైన మార్చి 17 న 20,78,719 మంది లబ్ధిదారు లకు వ్యాక్సిన్ వేశారు .

Related Articles

Back to top button