కొత్త పార్టీ ఏర్పాటుపై స్పందించిన తీన్మార్ మల్లన్న, Teenmar Mallana clarified
రాజకీయ పార్టీ పెట్టడం లేదని , Teenmar Mallana clarified అతి త్వరలోనే ఆరు వేల కిలో మీటర్ల పాదయాత్ర చేసిన తర్వాత ఆ టాపిక్ అని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు . నాగార్జున – సాగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేద న్నారు . సైన్యం తయారు చేసిన తర్వాత యు ద్దానికి పోవాలన్నారు . తీన్మార్ మల్లన్న భవి ష్యత్ కార్యాచరణ సమావేశం హైదరాబాద్ శివారులోని ఘట్ కేసర్‌లో ఆదివారం జరిగింది . దాసరి భూమయ్య ఆధ్వ ర్యంలో అడహక్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తీన్మార్ మల్లన్న ప్రకటిం చారు . ఆ కమిటీ చెప్పినట్టుగానే తాను నడుచు కుంటా నన్నారు . త్వరలోనే జిల్లా , మండల , నియోజకర్గ కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు . అలాగే క్యూ న్యూస్ బృందాన్ని కూడా మండలాల వారీగా ఏర్పాటు చేస్తామ న్నారు .
Teenmar Mallana clarified
తమను నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని ఒక రాజ కీయ పార్టీ రూ .100 కోట్ల ఆఫర్ ఇచ్చిందని అన్నారు . అందుకు తాను స్పందిస్తూ తానే రూ .100 కోట్ల ఒక రూపాయి ఇస్తానని “ మీ ‘ పార్టీని తమలో విలీనం చేయాలని సూచించినట్టు తెలిపారు . ధర్నాలు , రాస్తారో కోలు , ఉద్యమాలు చేసి చేసి అలసిపోయామని , ఇక నుంచి భవిష్యత్ లో ఆన్లైన్ సమావేశాలు , ఉద్యమాలు ఉంటాయని పేర్కొన్నారు . ప్రజాప్రతిని ధులు ప్రజలు నౌకర్లు అని , ఓనర్లు కాదని , సేవకులు మాత్రమేనని చెప్పారు . ఎన్నికల్లో గెలిచిన ప్రజా ప్రతినిధులు తప్పు చేస్తే ప్రజలు రీ కాల్ , రిఫరెండం చేసే ఏజెండా ఉండాలన్నారు . విద్య , ఆరోగ్యం , పేదరిక నిర్మూలన తదితర అంశాలపై ఫోకస్ పెడుతున్నామన్నారు . తమ బృందంలో ఎక్కువ మంది యువకులను భాగస్వామ్యం కల్పించి వారికి ప్రత్యేక శిక్షణనిస్తామన్నారు . అన్ని వర్గాలను మిలితం చేసుకుంటూ తాము ముందుకెళ్తామన్నారు .
షర్మిళతో టిఆర్ఎస్ , కాంగ్రెస్ , ఎంఐఎం లోపాయకారి ఒప్పందం??
TRS, కాంగ్రెస్ , ఎంఐఎం వై.ఎస్ షర్మి ళతో కలిసి లోపాయకారి ఒప్పందం చేసుకున్నాయని బిజెపి మాజీ ఎంఎ వ్ ఎన్వెఎస్ఎస్.ప్రభాకర్ ఆరోపించారు . హైదరాబాద్ లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘ వై.ఎస్.షర్మిళ సభకు ప్రభుత్వం అనుమతినివ్వ డంతో అందుకు ప్రతిఫలంగా ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితకు సాయం చేసేలా షర్మిళ పసుపు బోర్డు అంశాన్ని ప్రస్తావించిందని అన్నారు . వైఎస్ రాజశేఖర్ రెడ్డి సిఎంగా ఉన్నప్పుడు నిజామాబాదు పసుపు బోర్డును ఎందుకు తేలేదని ప్రశ్నించారు . బోర్డు విషయమై నాడు డి.శ్రీనివాస్ చెప్పి నప్పటికీ వైఎస్ వినలేదని , ఈ విషయం షర్మిళకు తెలియదా అని ప్రశ్నిం చారు.నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డిని గెలిపించుకునేందుకు ఎంఎల్‌సి ఎన్ని కల్లో చిన్నారెడ్డి , రాములు నాయకను బలిపశువులను చేశా రని ఆరోపించారు . తమకు పసుపు బోర్డే కావాలని రైతులు చెబితే కేంద్రంతో తాము మాట్లాడుతామని చెప్పారు . స్ట్రీస్ రీజనల్ ఎక్స్ టెన్షన్ బోర్డ్ తో పసుపునకు మంచి ధర వస్తుందని వివరించారు .