టోల్ గేట్ల పై కేంద్రం షాకింగ్ నిర్ణయం, govt to remove toll plazas
న్యూఢిల్లీ : govt to remove toll plazas జాతీయ రహదార్లపై ఉన్న టోల్ ప్లాజాలను ఏడాదిలోపు తొలగిస్తామని కేంద్ర రవాణాశాఖా మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించా రు . అందుకు ప్రత్యామ్నాయంగా , హైవేలపై ప్రయాణించే వాహనాల నుండి జిపిఎస్ విధా నం ద్వారా టోల్ వసూళ్ళు కొనసాగిస్తామని గురువారంనాడు లోకసభ ప్రశ్నోత్తరాల సమ యంలో గడ్కరీ స్పష్టం చేశారు . ఇప్పటికే 93 శాతం వాహనాలు ఫాస్ట్ ట్యాగ్ ద్వారా తమ తమ బ్యాంకు ఖాతాల నుండి టోల్ పన్నులు చెల్లిస్తున్నాయని , మిగిలిన ఏడు శాతం మంది పైన నిఘా వేస్తారని , ఎందుకు ఫాస్ట్ ట్యాగ్ తమ వాహనాలకు అమర్చలేదో సంజాయిషీ కోరుతూ వారిపై పోలీసు విచారణ జరుగుతుందని చెప్పారు .
ఫ్యాగ్ వాహనాలకు అమర్చకపోతే , టోల్ దొంగతనం , జిఎటి పన్ను ఎగవేతల కింద వారిపై కేసులు నమోదు చేస్తామని కూడా గడ్కరీ చెప్పారు . జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద వందలాది వాహనాలు తరచుగా నిలిచి పోతూ ఉండటం , ఘర్షణలు జరుగుతూ ఉండటం , టోల్ ఉద్యోగులతో పాటు , వాహన చోదకులకు , ప్రయాణికులకు అనేక సమస్యలు ఎదురవుతూ ఉండటంతో సాంకేతిక పరిజ్ఞానం ద్వారా 2016 లోలోనే తొలిసారి ప్రయోగ ప్రాతిపదికపై దేశంలో ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని అమలు చేయడం ప్రాంభిం చారు . దశలవారీగా ఈ విధానాన్ని వాహనచోదకులకు అలవాటు చేసింది . రెండు మూడు సార్లు గడువు పెంచడం ద్వారా అన్ని వాహనాలు దేశవ్యా ప్తంగా ఫాస్ట్ ట్యాగ్ ను అమర్చుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది .
govt to remove toll plazas
ఈ ఏడాది ఫిబ్రవరి 16 నుండి ఫాస్ట్ ట్యాగ్ ను వాహనాలకు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది . ఇక మూడవదశగా టోల్ ప్లాజాలను పూర్తిగా తొల గించి జిపిఎస్ పద్ధతిలోకి పురోగమిస్తున్నట్లు గడ్కరీ చెప్పారు . పాతవాహనా లకు ఉచితంగా ఫ్యాగ్ అమరుసారని చెప్పారు . రష్యా సహాయంతో ఈ జిపిఎస్ విధానాన్ని తీసుకున్నామని , వాహనయజమానుల సొంత బ్యాంకు ఖాతాల నుండే టోల్ పన్ను ఇకపై వసూలు అవుతుందని చెప్పారు . దీనివల్ల టోల్ ప్లాజాల వద్ద జాప్యం నివారించబడుతుంది . సత్వరం ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా వాహనాల రాకపోకలు ఇకమీదట సాఫీగా సాగిపోతాయని మంత్రి అన్నారు .
ఎంఎన్ కేటగిరీల కింద వాహనాలను విభజించినట్లు ఆయన చెప్పారు . ఎం కేటగిరిలో నాలుగు చక్రాల వాహనాలన్నీ ప్రయాణీకు లను తీసుకువెళ్ళే జాబితాలోకి వస్తే , ఎన్ కేటగిరి నాలుగు చక్రాల వాహనా లన్నీ సరుకు రవాణా జాబితాలోకి వస్తాయన్నారు . పాత వాహనాలపై ఒక విధాన్నా కూడా ప్రకటించారు . ఈ విధానంవల్ల దేశంలో ఆటోమొబైల్ పరి శ్రమ టర్నోవర్ 4.5 లక్షల కోట్ల నుండి 10 లక్షల కోట్లకు పెరుగుతుందని చెప్పారు . పాత వాహనం స్కాప్ విలువను స్కాపింగ్ సెంటర్ లెక్కగడుతుం దని , కొత్త వాహనం ఎక్స్ షోరూమ్ ధరపై సుమారు 46 శాతం ఉంటుందన్నారు .