Trending

బర్డ్ ఫ్లూ మనుషులకు వస్తుందా? Does bird flu come to humans

బర్డ్ ఫ్లూ అనేది వైర ల్ ఇన్ఫెక్షన్ . Does bird flu come to humans ఇది పక్షుల మ ధ్య మాత్రమే వ్యాపిస్తుంది . అయితే ఇది మనుషులకు , ఇతర జంతు జాతులకు కూడా వ్యాపి ంచి దాని ప్రభావాన్ని పెంచుకుంటుంది . సుమారు 12 రకాల బర్గ్ ఫ్లూ వైరస్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించినట్లు తెలుస్తోంది . అయితే ఇటీవల కాలంలో ఆందోళన కలిగించే నాలుగు జాతులు ఉన్నాయని వైద్యు లు చెబుతున్నారు . వాటిలో హెచ్ 5 ఎన్ 1 , హెచ్ 7 ఎన్ 9 , హెచ్ 5 ఎ 6 , హెచ్ 5 ఎన్ 8 ప్రధానమైనవిగా కేంద్ర పశుసంవర్థకశాఖ వైద్యబృందం గుర్తించింది . అయితే ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు హెచ్ 5 ఎన్ 1 , హెచ్ 7 ఎన్ 9 , హెచ్ 5 ఎన్ 6 , జాతుల బారిన పడి నట్లు వైద్యులు ప్రకటిస్తున్నారు . ఇది అనేక రకాలైన మరణాలకు దారితీసిందని వారు చెబుతున్నారు .

ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూహెచ్ఓ ) నివేదికల ప్రకారం బర్డ్ ఫ్లూ అంత్యంత సాధారణమైన హెచ్ 5 ఎన్ 1 1997 లో మానవజాతిలో తొలిసారిగా గుర్తించబడింది . ఇది దాదాపు 60 శాతం మంది ప్రజలక సోకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది . ఈ వైరస్ పక్షులకు ప్రాణాంతకం కాగా , మనుషులకు ఇతర జంతువులను క్యారియర్ తో సంబంధంలోకి తెస్తుంది . అయినప్పటికీ ఇది మానవుని నుండి మానవుని కేవలం సంపర్కరం ( సెక్సు వల్ రిలేషన్ ) ద్వారానే వ్యాప్తి చెందుతుంది . ఎన్‌హెచ్ఎస్ ప్రకారం , బర్డ్ ఫ్లూ హెచ్ఎన్ 8 జాతి ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా ఏ మానవులకూ సోకలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది .

బర్డ్ ఫ్లూ హిస్టరీ::

దేశంలో బర్డ్ ఫ్లూ వ్యాధి ఇప్పటికే 7 రాష్ట్రాల్లో విస్తరిస్తరించింది . దీని ప్రభావం నెమ్మదిగా ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపించే వీలుందన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అప్రమత్తమైయ్యాయి . బర్డ్ ఫ్లూ వ్యాధి కేరళ , మధ్యప్రదేశ్ , గుజరాత్ , హరియానా , హిమాచల్ ప్రదేశ్ , ఉత్తర్ ప్రదేశ్ , రాజస్థాన్ రాష్ట్రాలలో ఫ్లూ వ్యాధి ఉందని కేంద్రం గుర్తిం చింది . తాజాగా ఢిల్లీ , మహా రాష్ట్రలోనూ బర్డ్ ఫ్లూ వెలుగు చూడటంతో కేం ద్రం మరింత అప్రమ త్తమైంది . దీంతో హరి యానా , పంజాబ్ , హిమాచల్ ప్రదేశ్ , న్యూ ఢిల్లీ , జమ్మూకాశ్మీర్ ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి పౌలీ ఉత్పత్తుల రవాణాను నిలిపి వేశారు . అయితే కేవలం పక్షి జాతులకు మా త్రమే సంక్రమించే ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి మనుషులకు కూడా త్వరితగతిన వ్యాపించే వీలుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు .

ఇదే సమ యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక చర్యలు మరింత వేగంగా చేపట్టవచ్చునని వారు సూచిస్తున్నారు . అసలు బర్డ్ ఫ్లూ అనేది వైరల్ ఇన్ఫెక్షన్ , ఇది పక్షుల మధ్య మాత్రమే వ్యాపిస్తుంది . అయితే అదే వేగంగా మనుషులతో పాటు ఇతర జంతువులపైనా దీని ప్రభావం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు . ఏవియన్ ఇన్సూ ఎంజా అని కూడా పిలిచే ఈ బర్డ్ ఫ్లూ మానవులకు ఇతర జంతువులకు ఎంతో వేగంగా సోకుంది . ఒక వ్యక్తి ఈ వైరస్ బారిన పడిన తరువాత పక్షి ప్లూ సంకేతాలు లేదా ఆ లక్షణాలు చాలా త్వరగా కనిపిస్తాయి . బర్డ్ ఫ్లూ సంభావ్య సమస్యలు కూడా తలెత్తవచ్చు . న్యూమోనియా , సెప్పిస్ , అవయవ వైఫల్యం , తీవ్రమైన శ్వాసకోశ బాధతో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిన వారు ఇబ్బందులు అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు . కరోనా వైరస్ మహమ్మారి నావల్ మధ్య దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నవేళ , ఉన్న టుండి మరో క వైరస్ ఏవిఎస్ ఇంజా , ఏవియస్ ఫ్లూ లేదా బర్డ్ ఫ్లూ అనే వ్యాధి చాపకింద నీరులా విస్తరించడం తీవ్ర ఆందోళనను కలిగి స్తోంది . రాజస్థాన్లో మొట్టమొదట బయటపడ్డ బర్డ్ ఫ్లూ నెమ్మదిగా హిమా చల్ ప్రదేశ్ , మధ్యప్రదేశ్ , కేరళ రాష్ట్రాలలో వ్యాపించింది .

Does bird flu come to humans

మానవులకు బర్డ్ ఫ్లూ వస్తుందా…

సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్ సోకిన పక్షులతో ( చనిపోయిన లేదా సజీవంగా ) సన్నిహిత సంబంధాల ద్వారానే వ్యాపిస్తుంది . ఈ వ్యాధి సోకిన పక్షులను ముట్టుకోవడం , పక్షుల ద్రవాలు , పరుపులను తాకడం , వంట కోసం వ్యాధి సోకిన పౌట్రీ ఉపయో గించడం లేదా సిద్ధం చేసుకోవడం మొదలైన వాటి ద్వారా మానవులకు బర్డ్ ఫ్లూ వ్యాధి సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి .

నివారణ మార్గాలు .. !

బర్డ్ ఫ్లూ వ్యాధిని నివారించడంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మూలంగా దీని వ్యాప్తిని అరికట్టవచ్చునని వైద్యులు చెబు తున్నారు . ముఖ్యంగా మాసం , కోడిమాంసం , గుడ్లు వంట చేసుకొని తినే ముందు వాటిని శుభ్రం చేసుకున్న తరువాత సాధారణ వంట చేసే విధంగా కాకుండా మరింత సమయం వాటిని ఉడకబెట్టి తినడం వల్ల ప్రయోజనం ఉంటుందని వారు సూచిస్తున్నారు . వేడినీళ్లు సబ్బుతో చేతులు క్రమం తప్పకుండా శుభ్రంగా కడుక్కోవడం , ముఖ్యంగా ఆహార పదార్థాలను వంటచేయడానికి ముందు ఆతరువాత కూడా శుభ్రంగా చేతులు కడుక్కోవాలి . అలాగే ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ప్రయా ణించాల్సి వస్తే ఆల్కాహాల్ ఆధారితమైన ( కనీసం 60 శాతం ) హ్యండ్ శానిటైజర్ను ఉపయో గించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది . అలాగే బహిరంగ మార్కెట్ విధానాన్ని నివారిం చాలి . పక్షులతో , పౌలీలతో సంబంధాలకు దూరంగా ఉండాలి . కోడి మాంసం , బాతులను ఆహారంగా తీసుకోవడం బాగా తగ్గించాలి . పచ్చిగుడ్లను తీసుకోవడం పూర్తిగా మానేయాలి .

Related Articles

Back to top button