నష్ట పరిహారం అడిగారని అత్యాచారం, Women raped in Ranchi
రాంచీ : నష్ట పరిహారం అడిగారని అత్యాచారం, Women raped in Ranchi ఝార్ఖండ్ లో 50 ఏళ్ల వితంతువుపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే . ఈ అఘాయి త్యాన్ని మహిళ ప్రతిఘటించడంతో ఆమెను శారీరకంగా చిత్రహింసలు పెట్టి పైశాచిక ఆనందం పొందారు . ఈ నెల 7 న ( గురువారం ) జరిగిన ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన మహిళను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు . తాజాగా ఆసుపత్రిలో చికిత్స తీసుకొని బాధితురాలు ఆదివారం డిశ్చార్జి అయింది . ఈ క్రమంలో పోలీసులు బాధితురాలి స్టేట్మెంట్ ను రికార్డు చేశారు . తన మేకను కొట్టినందుకు నష్ట పరిహారం ఇవ్వాలని కోరినందుకు నిందితులు తనపై అత్యాచారం చేశారని మహిళ పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో పేర్కొంది .
ఈ మేరకు ఎస్పీ రిషబ్ ఝా మాట్లాడుతూ , Women raped in Ranchi అత్యాచార కేసులో మహి ళ స్టేట్ మెంట్ తీసుకున్నామని , దోషులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు . కాగా , చత్రా జిల్లాలోని హంటర్ గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో 50 ఏళ్ల వితంతువు తన కుటుంబ సభ్యులతో జీవిస్తోంది . గురువారం రాత్రి సమయంలో బహిర్భూమికి వెళ్లడానికి ఇంటికి కొంత దూరంలోని బహిరంగ ప్రదేశానికి వచ్చింది . ఆ సమయంలో అక్కడ ఉన్న ముగ్గురు యువకులు వితంతువుపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు . ఆమె వారి నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రతిఘటించింది . దీంతో వారు ఆమెను హింసించి , ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదరించి అక్కడి నుంచి పారిపోయారు . బహిర్భూమికి వెళ్లిన మహిళ ఎంత సేపటికీ రాక పోయేసరికి కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించారు . తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను బహిరంగ ప్రదేశంలో గుర్తించారు . వెంటనే ఆమెను సమీపంలోని హంటర్ గంజ్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు . అక్కడ ఆమె కు ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం బీహార్ గయలోని అనుగ్రా నారాయణ్ మగధ్ మెడికల్ కాలేజీకి తరలించారు . అక్కడ ఆమె చికిత్స పొంది ఆదివారం డిశ్చార్జి అయింది . కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు .