చిన్న దొరే నెక్స్ట్ సీఎం.! Telangana next CM KTR ?
టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కె.టి. రామారావు Telangana next CM KTR ముఖ్యమంత్రి కావాలనే వాదనను మంత్రులు , ఎంఎల్‌ఎలు మరింత ముందుకు తీసుకెళ్తున్నారు . గతంలో పలుమార్లు ఈ అంశం తెరపైకి వచ్చింది . అయితే , ముఖ్యమంత్రిగా కెసి ఆర్ మరో 10-15 ఏళ్ళు ఉంటారని స్వయంగా కెటిఆర్ ప్రకటించడంతో సద్దుమణిగింది . ఈ సారి టిఆర్ఎస్ సీనియర్ నేత , వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఒక టివి ఛానల్ చేసిన ఇంటర్వ్యూలో కెటిఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేమిటి అని వ్యాఖ్యానించడంతో తాజాగా ఆ వాదనకు బలం చేకూరింది . దానికి కొనసాగింపుగా పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కెటిఆర్‌కు అన్ని అర్హతలు ఉన్నా యని , ఆయన సిఎం అయితే తప్పేమిటని అనడంతో ఆ చర్చ ఊపందు కుంది .
హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో పాఠశాలల పునఃప్రారంభంపై మరో మంత్రి మహమూద్ అలీతో కలిసి బుధవారం మావేశమయ్యారు . అనంతరం మీడియాతో మాట్లాడిన ప్పుడు కెటిఆర్ కు సిఎం పదవిపై జరుగుతున్న చర్చ గురించి ప్రశ్నించగా , అందులో తప్పేముందని తలసాని అన్నారు . దీనిపై ముఖ్యమంత్రి తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటారని అన్నారు . ఇదే మాదిరిగా టిఆర్ఎస్ సీనియర్ ఎంఎలు కూడా జిల్లాల్లో మీడియా ఎదుట అభిప్రాయాలను వ్యక్తపరిచారు . అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి కెసిఆర్ ఉన్నప్పటికీ , వారి కన్నుసనల్లో ఉన్న యువకుడు మంత్రి కెటిఆర్ Telangana next CM KTR ముఖ్యమంత్రి అయితే బాగుంటుందనే కోరిక జనంలో ఉన్నదని నిజామాబాద్ రూరల్ ఎంఎ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు . సిఎం కెసిఆర్ ఆలోచించి నిర్ణయం తీసుకోవా లని , కెటిఆర్‌కు తగిన సలహాలు ఇవ్వాలని అన్నారు . కెటిఆర్ సిఎం అయితే బాగుంటుందనుకునే వారిలో తానూ ఒకడినని అన్నారు . యువ నాయకుడు కెటిఆర్ ని సిఎం కెసిఆర్ ఆశీర్వదించి ముఖ్యమంత్రిగా ఛాన్స్ ఇస్తే బాగుంటుందనేది తన వ్యక్తిగత ఆలోచన అని మరో టిఆర్ఎస్ నేత , బోధన్ ఎంఎ షకీల్ అహ్మద్ అన్నారు . కెటిఆర్ అధ్యక్ష తనే వచ్చే అసెంబ్లీ సమావేశాలు జరగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు . కెటిఆర్ ముఖ్య మంత్రి అయితే యువనాయకులమంతా మరింత కృషి చేసి తెలంగాణ అభివృద్ధి కోసం మరింత బాగా పని చేస్తామన్నారు .
ఇదిలా ఉండగా గతంలో మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్ , మహమూద్ అలీ తదితరులు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు . ఫిబ్రవరిలో కెటిఆర్‌కు ముఖ్యమంత్రిగా పట్టా భిషేకం జరుగుతుందని టిఆర్ఎస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్న ప్పటికీ , ఇప్పటి నుండి అటు అధ్యక్షుడు కెసిఆర్ , వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి ఆర్ నుండి ఎలాంటి స్పందన రాలేదు . ముఖ్యమంత్రి కెసిఆర్ , సతీసమే తంగా మంగళవారం కాళేశ్వరం సందర్శించారు . మరో వైపు మంత్రి కెటి ఆర్ హైదరాబాద్ నగరంలో అభివృద్ధి పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు . రాజ కీయంగా అత్యంత అనుకూల పరిస్థితుల్లో కెటిఆర్‌ను రెండేళ్ళ క్రితం 2018 డిసెంబర్ 14 వ తేదీన టిఆర్ఎస్కు వర్కింగ్ ప్రెసిడెంట్ గా టిఆర్ ఎస్ అధ్యక్షులు , సిఎం కెసిఆర్ నియమించారు . అయితే , టిఆర్ఎస్ అధికా రంలోకి వచ్చాక ఆరున్నరేళ్ళలో దుబ్బాక ఉప ఎన్నిక , జిహెచ్ఎంసి వరుస ఎన్నికల్లో ఎదురుదెబ్బలతో ప్రతికూలత ఉన్న సమయంలో కెటిఆర్ ముఖ్య మంత్రి అనే వాదన మరోసారి తెరపైకి వచ్చింది .