50 వేలకు చేరువలో కరోనా కేసులు, india reached 50k coronacases

 దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది . అయితే గత రెండు రోజులతో పోలిస్తే రోజు వారీ కేసుల సంఖ్య కాస్త తగ్గింది . india reached 50k coronacases గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,72,645 కొవిడ్ నిర్ధా రణ పరీక్షలు నిర్వహించగా , 83,809 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . దీంతో మంగళవారం నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 49,30,236 కు చేరుకుంది . వీరిలో ఇప్పటివరకు 38,59,399 మంది కోలుకుని డిశ్చార్జి కాగా మరో 9 లక్షల 90 వేల యాక్టివ్ కేసులున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది . కాగా దేశంలో మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలి గిస్తోంది . తాజాగా గడచిన 24 గంటల్లో దేశవ్యా ప్తంగా 1,054 మంది కరోనాతో పోరాడుతూ మృత్యువాత పడ్డారు . దీంతో ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 80,776 కు చేరుకుంది .

 దేశంలో కరోనా కేసుల సంఖ్య ఆగస్టు 7 న 20 లక్షలను దాటగా , ఆగస్టు 23 న 30 లక్షలకు , సెప్టెంబర్ 5 న 40 లక్షలకు చేరుకుంది . బుధవారం నాటికి ఈ సంఖ్య 50 లక్ష లకు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది . అయితే కొవిడ్ -19 తో మరణిస్తున్న వారిలో 70 శాతం మంది ఇతర ఆరోగ్య సమస్యలున్న వారేనని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేస్తోంది . దేశంలో ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 78.28 శాతానికి చేరుకోవడం కాస్త ఊరట కలిగిస్తోంది . గత కొన్ని రోజులుగా దేశంలో కోలుకుంటున్న కరోనా రోగుల సంఖ్య భారీగా ఉంటోంది . సోమ వారం సైతం దేశవ్యాప్తంగా 79,292 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు . అయితే మరణాల రేటు మాత్రం 1.64 శాతంగా కొనసాగుతోంది . ఇదిలా ఉండగా దేశంలో ఉన్న యాక్టివ్ కేసుల్లో దాదాపు సగం కేసులు మూడు రాష్ట్రాల్లోనే మహారాష్ట్ర , తమిళనాడు , ఆంధ్రప్రదేశ్ లోనే ఉండగా , ఉత్తర ప్రదేశ్ , తమిళనాడు , చత్తీస్ గఢ్ , ఒడిశా , కేరళ , తెలంగాణ రాష్ట్రాల్లో మరో 24.4 శాతం యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది .

india reached 50k coronacases ::

 మహా రాష్ట్ర తమిళనాడు , కర్నాటక , ఆంధ్రప్రదేశ్ , ఢిల్లీ రాష్ట్రాల్లోనే దేశంలోని మొత్తం కేసుల్లో 60.35 శాతం కేసులు ఉండగా , ఈ రాష్ట్రాల నుంచే మొత్తం రికవరీల్లో దాదాపు 60 శాతం నమోదవు తున్నాయని ఆ శాఖ వివరించింది . అలాగే ఇప్పుకాగా టివరకు సంభవించిన మొత్తం మరణాల్లో 37 శాతానికి పైగా అంటే 29,894 మర ణాలు ఒక్క మహారా ప్రలోనే నమోద య్యాయి . తాజాగా సంభవిం చిన మరణాల్లో సైతం అత్యధికంగా 363 మరణాలు ఈ రాష్ట్రం వెలుగు చూశాయి . కాగా దేశంలో ఆక్సిజన్ సిలిండర్లకు ఎలాంటి కొరతా లేదని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ విలేఖరులకు చెప్పారు .

ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 5 కోట్ల 83 లక్షల శాంపిళ్లకు కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వ హించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి ( ఐసి ఎంఆర్ ) వెల్లడించింది . అమెరికాలో సగానికి తగ్గిన రోజువారీ కేసులు ఇదిలా ఉండగా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ -19 ప్రభావం అధికంగా ఉన్న అమెరికాలో దీని ఉధృతి కొనసాగుతూనే ఉంది . అయితే జూలై నెలలో నిత్యం 70 వేలకు పైగా కేసులు నమోదవుతుం డగా ఇప్పుడు ఆ సంఖ్య 35 వేలకు తగ్గింది . ఆమె రికా వ్యాప్తంగా కరోనా ప్రభావం కాస్త తగ్గు ముఖం పట్టినట్లు కనిపించినా 7 రాష్ట్రాల్లో మాత్రం అధికంగా ఉన్నట్లు అక్కడి అధికారులు వెల్లడిం చారు . ఇక కరోనా మరణాల్లో అమెరికా అగ్రస్థా నంలో ఉండగా , బ్రెజిల్ , భారలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి .

Related Articles

Back to top button