కేంద్రం పై గరం అయిన kcr, KCR comments on new electricity bill
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విద్యుత్ చట్టం చాలా ప్రమాదక రంగా ఉందని , ఈ బిల్లును పూర్తిస్థాయిలో వ్యతిరే కిస్తున్నామని ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు . KCR comments on new electricity bill కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ శాసనసభ మంగళవారం ఏక గ్రీవ తీర్మానం చేసింది . కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని సిఎం కెసిఆర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా కాంగ్రెస్ , ఎంఐఎం పార్టీలు మద్దతు తెలిపాయి .
అనంతరం కేంద్ర విద్యుత్ చట్టం బిల్లు ఉపసంహరణ తీర్మానానికిశాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది . అంతకు ముందుకు ఈ బిల్లుపై చర్చ జరిగింది . ఈ సంద ర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ అన్న వస్త్రా లకు పోతే ఉన్న వస్త్రం పోయినట్టుగా కేంద్ర చట్టం ఉందని సిఎం కెసిఆర్ దుయ్యబట్టారు . విద్యుత్ సంస్థలుపోతే ఉద్యోగులు పరిస్థితి ఏమిటనీ , క్రాస్ సబ్సిడీ చేయలేమన్నారు . ఈఆర్ సి మనచేతిలో ఉండదన్నారు . కేంద్ర విద్యుత్ చట్టంలో అనేక లోపాలు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు . ఈ చట్టం ద్వారా రాష్ట్రాల అధికారాలు , రాష్ట్రాల లోడ్ సెంటర్లు అన్నీ ఢిల్లీకి వెళతాయని ఆయన వివరిం చారు . మనరాష్ట్రంలో జలవిద్యుత్ ఉత్పత్తికి ఎక్కువ అవకాశం ఉందన్నారు . కొత్త చట్టంలో రెన్యుబుల్ విద్యుత్ 20 శాతం ఉండాలని నిబంధన ఉందని , కొత్త చట్టం ద్వారా రాష్ట్రాలు తప్పనిసరిగా విద్యుత్ కొనాల్సిన పరిస్థితి నెలకొంటుందన్నారు .
KCR comments on new electricity bill ::
కేంద్రంలో అధికారంలో ఎవరున్నా రాష్ట్రాల హక్కు లను హరిస్తున్నాయని సిఎం కెసిఆర్ ఆరోపిం చారు . మన దగ్గర ఉన్న వరదకాలువల మీద పది , పదిహేను వేల మీటర్లు ఉండేవని , ఒక్కొక్కరే ఒకటి , రెండు ఎకరాలను ఆ కరెంట్‌తో పండించుకునే వారని వారిని కూడా అప్పటి ప్రభుత్వాలు ఘోరంగా దెబ్బతీశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు . తాము అధికారంలోకి వచ్చాక వారిని కాపాడుకున్నామన్నారు . ప్రస్తుతం 30 నుంచి 40 వేల మోటార్లు నడుస్తున్నాయని ప్రస్తుతం కొత్త చట్టం వస్తే వాటికి కూడా కరెంట్ మీటర్లు పెట్టాల్సి వస్తుందన్నారు . విద్యుత్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉంటే వీటినన్నింటిని రక్షించుకోవచ్చన్నారు . దీంతోపాటు డిస్కంలు , ట్రాన్స్ కో , జెన్ కో అభివృద్ధి చెందుతాయని , ఈ సంస్థలు లేకుంటే వేల మంది ఉద్యోగులు రోడ్డు మీద పడతారని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు .
తాము అధికారం లోకి వచ్చాక 22 వేల ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేశా మని సిఎం కెసిఆర్ తెలిపారు . తాను చిన్నగా ఉన్న ప్పుడు బిల్లు కలెక్టర్లు ఉండేవారని , ఆయన్ను చూస్తే జిల్లా కలెక్టర్ కంటే రైతులు ఎక్కువ భయపడే వారని సీఎం తెలిపారు . ప్రస్తుతం కేంద్రం తీసు కొచ్చే చట్టం ద్వారా మీటర్లు వస్తాయని , దీంతో పాటు రెండు నుంచి మూడువేల మంది బిల్లు కలె క్టర్లు వస్తారని సీఎం పేర్కొన్నారు . ఇది రైతులకు , ప్రజలకు అంగీకారమా ? అని రాష్ట్ర బిజెపి నేతలకు ఆయన ప్రశ్నించారు .