బీజేపీ కి షాకిచ్చిన కేంద్ర మంత్రి BJP minister resigns

BJP minister resigns పదవికి హర సిమ్రత్ రిజెన్ రాజీనామా . మోడీ ప్రభుత్వ వ్యవసాయ సంబంధ బిల్లులకు నిరసనగా కేబినెట్ నుంచి వైదొలిగిన శిరోమణి అకాలీదళ్, ఎ.ఎలో కొనసాగుతామని ఎఎడి ప్రకటన. కేంద్ర ప్రభుత్వం పార్ల మెంటులో ప్రవేశ పెట్టిన వ్యవసా య సంబంధ బిల్లులను నిరసిస్తూ కేంద్ర మంత్రి పదవికి శిరోమణి అకాలీదళ్ సభ్యురాలు హరిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా చేశారు .

 కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిగా  ఆమె ఉంటున్నారు . తన రాజీనామాను ప్రధాని మోడీ కార్యాలయంలో సమర్పించారు . ఎన్టీ యేలో ప్రధాన భాగస్వామిగా శిరోమణి అకాలీ దళ్ ఉంటున్న సంగతి తెలిసిందే . కేంద్రం తీసుకొ చ్చిన ఈ బిల్లుల్లో అనేక అంశాలు రైతులకు వ్యతి రేకంగా ఉన్నాయని దీనివల్ల వ్యవసాయ రంగం మరింత ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందని అకాలీదళ్ అభిప్రాయపడింది . ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే వ్యవసాయ రంగం సంక్షోభం లోకి వెళ్తుందని అకాలీదళ్ కేంద్రంతో విభేదిం చింది . పంజాబ్ , హర్యానా వ్యవసాయ సంఘా లన్నీ ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించాయి . ఈ బిల్లుల వల్ల తమ వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర రాకుండా పోతుందని రైతులు ఆందో ళన వెలిబుచ్చారు . BJP minister resigns బిల్లులను నిరసిస్తూ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశానని , రైతుల పక్షాన వారి కుమార్తెగా , సోదరిగా గట్టిగా నిలబ డుతున్నందుకు గర్వపడుతున్నానని హరిమ్రత్ ట్విటర్‌లో ప్రకటించారు . ఈ బిల్లులపై లోక్స భలో చర్చ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్ మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి వ్యతిరేకంగా ఉన్నందున ఈ బిల్లులను పూర్తిస్థాయిలో తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు .

 వ్యవసాయ రంగ నిర్మాణానికి ఏబై ఏళ్లుగా పంజాబ్ ప్రభుత్వాలు చేసిన కృషి ఇప్పుడు నాశనమౌతుందని వ్యాఖ్యానించారు . ఇకపై తమ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో కొనసాగ దని స్పష్టం చేశారు . తరువాత కొద్ది సేపటికే సభ నుంచి బయటకు వచ్చిన హరిసిమ్రత్ కౌర్ బాదల్ పిఎంఒకు వెళ్లారు . కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రైతు వ్యతిరేక విధానానికి వ్యతిరేకంగానే తానీ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు . అయితే శిరో మణి అకాలీదళ్ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చినప్పటికీ ఎన్డీయేలో కొనసాగనున్నట్టు తెలు స్తోంది . కేంద్రం తీసుకొచ్చిన మూడు బిల్లుల అంశాలను పరిశీలిద్దాం . 1. రైతులు తమ వ్యవ సాయ ఉత్పత్తులను వ్యవసాయ మార్కెట్ యార్డు ల్లోనే విక్రయించాలన్న నిబంధనను తొలగిస్తూ తీసుకొచ్చి ది ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ( ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ ) బిల్లు . 2. పంట వేయడానికి ముందే వ్యవసాయ ఉత్ప త్తుల విక్రయంపై వ్యాపారులు , రైతులు చేసుకునే ఒప్పందాలకు రక్షణ కల్పించే ది ఫార్మర్స్ , ( ఎంప వర్మెంట్ అండ్ ప్రొటెక్టన్ ) అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫామ్ సర్వీసెస్ బిల్లు 3 . సహకార బ్యాంకులపై పర్యవేక్షణ అధికారాలను ఆర్‌బిఐకి కట్టబెడుతూ తీసుకొచ్చిన ది బ్యాంకింగ్ రెగ్యులేషన్ ( అమెండ్ మెంట్ ) బిల్లు .

Related Articles

Back to top button