మంచిర్యాల లో కరోనా ఉదృతి, Mancherial coronavirus bulletin

 జిల్లాలో కరోనా జోరు కొనసా గుతోంది . Mancherial coronavirus bulletin మంచిర్యాలకు చెందిన 56 ఏళ్ల సింగరేణి కార్మికుడు కరోనా లక్షణాలతో ఆదివారం రాత్రి మృతి చెందాడు . జిల్లాలో సోమవారం మరో 21 కేసులు నమోదయ్యాయి . అధికారులు కరో నాతో పది మంది చనిపోయారని చెబుతున్నారు . అయితే కరోనా లక్షణాలతో మరో తొమ్మిది మంది మృతి చెందారు . బెల్లంపల్లి ఐసో లేషన్ కేంద్రంలో అయిదుగురి నుంచి నమూనాలు సేకరించి ఉస్మా నియా ఆసుపత్రికి పంపించారు . బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో యాంటిజెన్ కిట్ల కొరతతో సోమవారం పరీక్షలు నిర్వహించ లేదు .

 ఐసోలేషన్ కేంద్రం  ప్రభుత్వాసుపత్రిలోనూ పరీక్షలు చేయకపోవడంతో లక్షణాలు కలిగిన వారు ఇబ్బందులు పడాల్స్ వచ్చింది . కుమురంభీం ఆసిఫాబాద్ , ఆదిలాబాద్ జిల్లాల్లో కరోనా బులెటిన్లను విడుదల చేస్తున్నప్పటికీ ఇక్కడి జిల్లా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తున్నారు . కరోనా కేసుల నమోదు , మృతుల వివరాలను వెల్లడించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి .  జన్నారం మండలం బాదంపల్లి గ్రామానికి చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా వైద్యాధికారి డా.సునీత తెలిపారు . హైదరాబాద్ లోని ఓ కుపెనీలో పని చేసే వీరిద్దరు ఇటీవల స్వగ్రామానికి వచ్చారు . దీంతో జగిత్యాలలోని ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ అని తేలింది . కరోనా లక్షణాలు తక్కువగా ఉండడంతో ఆ ఇద్దరిని హోం క్వారంటైన్ చేసినట్లుగా వైద్యురాలు తెలిపారు . బాదంపల్లి గ్రామంలో మాస్కులు లేకుండా తిరిగే వారికి రూ . 500 జరిమానా విధించను న్నట్లు సర్పంచి సీపతి ఆనందం తెలిపారు .

Mancherial coronavirus bulletin ::

 చెన్నూరు  ప్రాంతంలో కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది .ఒకటి , రెండుతో ప్రారంభమైన కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ 50 కి చేరింది . తాజాగా సోమవారం చెన్నూరులో 30 మందికి పరీక్షలు నిర్వ హించగా .. 12 మందికి పాజిటివ్ వచ్చింది . చెన్నూరుతో పాటు , కోటపల్లి , భీమారం మండలాలకు చెందినవారు . చెన్నూరుకు వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు . స్థానిక వ్యాధి నిర్ధారణ కేంద్రం ఏర్పాటు చేసిన పదిరోజుల్లోనే 50 కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు . ఇప్పటికే పట్ట ఇంలోని పలువురు వ్యాపారులు స్వచ్ఛందంగా నిర్దేశిత సమయం వరకే దుకాణాలను తెరిచి ఉంచుతున్నారు . చెన్నూరు . పట్టణంలోని కొత్తగూడెంకాలనీకి చెందిన ఆరుగురికి , సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు ఇద్దరికి , బీమారంలో ఒకరికి , చెన్నూరు మండలంలోని సోమనపల్లిలో ఒకరికి , కోటపల్లి మండలంలోని నక్కలపల్లి , రాంపూర్ గ్రామాలకు చెందిన ఒక్కొక్కరికి వ్యాధి నిర్ధారణ అయింది .

Related Articles

Back to top button