SBI బ్యాంక్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల SBI BANK NOTIFICATION
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో SBI BANK NOTIFICATION సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుద లైంది . దేశంలోని ఎనిమిది సర్కిళ్లలో మొత్తం 3850 ఖాళీలు ఉన్నాయి . ఏ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు అక్కడే అప్లై చేసుకోవాలి . హైదరా బాద్ సర్కిల్ లో 550 ఖాళీలు ఉన్నాయి . అప్లై చేయడానికి చివరితేది ఆగస్టు 16 .
ఎలిజిబులిటీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ అర్హత కలిగి ఉండాలి . 2020 ఆగస్టు 01 నాటికి కనీసం రెండేండ్లపాటు ఏదైనా షెడ్యూ ల్డ్ కమర్షియల్ బ్యాంక్ లేదా రీజినల్ రూరల్ బ్యాంక్ లో ఆఫీసర్ గా పనిచేసి ఉండాలి . స్థానిక భాషలో టెన్ లేదా ఇంటర్ చదివి ఉండాలి . గతంలో బ్యాంక్ రుణాలు , క్రెడిట్ కార్డు బిల్లు బకాయి ఉన్న వాళ్లు , సిబిల్ స్కోర్ తక్కువగా ఉండి డిఫాల్ట్ ఉన్నవాళ్లు పోస్టుకు అనర్హులు ) 2020 , ఆగస్టు 1 నాటికి వయసు 30 ఏండ్లు మించరాదు . ( ఎస్సీ , ఎస్టీ , బీసీ , విక లాంగులకు వయోపరిమితిలో మినహాయిం పు ఉంటుంది ) సెలెక్షన్ ప్రాసెస్ షార్ట్ లిస్టింగ్ , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది . రాత పరీక్ష నిర్వహించే హక్కు బ్యాంకు ఉంది .
SBI BANK NOTIFICATION ::
బ్యాంక్ ఏర్పాటు చేసిన కమిటీ షార్ట్ లిస్టింగ్ చేస్తుంది . ఆ తరువాత , బ్యాంక్ నిర్ణయించిన విధంగా తగిన సంఖ్యలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు . ఇంటర్వ్యూలో పొందిన స్కోర్ ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు . ఒకటి కంటే ఎక్కువ అభ్యర్థులు కట్ – ఆఫ్ మార్కులు స్కోర్ చేస్తే వారి వయస్సు ప్రకారం ర్యాంక్ తీస్తారు . ప్రతి స్టేజ్ లో బ్యాంక్ వారిదే తుది నిర్ణయం ఉంటుంది . ఎంపికైన వారికి ఆరు నెలల పాటు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది . ఆ తర్వాత సర్కిల్ బేస్డ్ ఆఫీసర్‌గా ఉద్యోగంలో నియమిస్తారు .
నోటిఫికేషన్ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు :
మొత్తం ఉద్యోగాలు 3850,, వేతనం రూ.23,700-42,020 అప్లికేషన్ చివరితేదీ ఆగస్టు 16, ఫీజు జనరల్ , ఈడబ్ల్యూఎస్ , ఓబీసీలకు రూ .750 / ఎస్సీ , ఎస్టీ , పీహెచ్ సీలకు మినహాయింపు.
ఆన్లైన్లో ఆప్లై చేయాలి www.sbi.co.in/web/ careers /
ఖాళీలు ::
హైదరాబాద్ 550 అహ్మదాబాద్ 750 బెంగళూరు 750 భోపాల్ 400 ( ఎంపీ -296 , ఛత్తీస్ గఢ్ -104 ) చెన్నై 550 జైపూర్ 300 మహారాష్ట్ర ( ముంబై మినహా ) 517 గోవా 33