తెలంగాణలో పెరిగిన కరోనా వైరస్, TS coronavirus tally

తెలంగాణలో కొత్తగా 1430 కేసుల నమోదు. జీహెచ్ఎంసీ పరిధిలో 703 కొత్త కేసులు,, TS coronavirus tally 47,705 కు చేరిన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య. కొత్తగా 2,062 మంది డిశ్చార్జ్ , ఏడుగురు మృతి.

  రెండు రోజులుగా రాష్ట్రంలో తగ్గించినట్టు కనిపించిన కరోనా వైరస్ మళ్ళీ ఒక్కసారిగా ఉధృతమైంది . 1200 నుంచి 1800 లోపు నమోదైన కేసులు మంగళవారం ఒక్కసారిగా పెరిగాయి . తాజాగా రాష్ట్రంలో 1430 మందికి కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్లో పేర్కొంది . దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 47 , 705 కు చేరుకుంది . ఇప్పటి వరకు ఏ రోజు చేయనన్ని కరోనా టెస్టులు సోమవారం నిర్వహించారు . ఒక్కరోజే 16,855 పరీక్షలను నిర్వహించారు . దీంతో రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య మూడు లక్షలకు చేరువలో 2,93,077 గా నమోదైంది . అదే సమయంలో కరోనాతో చికిత్స పొందుతూ కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది . తాజాగా 2,062 మంది కోలుకుని వారి వారి ఇళ్ళకు వెళ్ళిపోయారు .

TS coronavirus tally ::

 కరోనా బారినపడి కోలుకుంటున్న వారి శాతం కూడా క్రమంగా పెరుగుతోంది . ఇప్పటి వరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 86,885 గా నమోదు కాగా , శాతం 70 నుంచి 76 శాతానికి పెరిగింది . మరో ఏడు మంది సోమవారం కరోనాతో మృతి చెందారు . రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 422 కు చేరింది . కరోనా బారినపడి చికిత్స పొందాకకూడా మృతి చెందుతున్న వారి శాతంలో కూడా తగ్గుదల నమోదైంది . నిన్న మొన్నటి వరకు 0.9 చేంజ్ గా ఈ శాతం సోమవారం 0.89 శాతానికి పడిపోయింది . నిర్వహించిన మొత్తం నిర్ధారణ పరీక్షల్లో వెలుగు చూసిన పాజిటివ్ కేసుల శాతం కూడా 17 నుంచి 16 శాతానికి పడిపోయింది . జిల్లాల వారీగా చూస్తే హైదరాబాద్ లో 708 , రంగారెడ్డి 117 , మేడ్చల్ 105 , సంగారెడ్డి 50 , ఖమ్మం 14 , కామారెడ్డి 48 , వరంగల్ అర్బన్ 34 , వరంగల్ రూరల్ 20 , నిర్మల్ 1 , కరీంనగర్ 27 , జగిత్యాల 18 , యాదాద్రి – భువనగిరి 9 , మహబూబాబాద్ 27 , పెద్దపల్లి 4 , మెదక్ 26 , మహబూబ్ నగర్ 6 , మంచిర్యాల 5 , కొత్తగూడెం 5 , భూపాలపల్లి 27 , నల్గొండ 45 , సిరిసిల్లరి , ఆదిలాబాద్ 7 , వికారాబాద్ లి , నాగర్ కర్నూల్ 18 , జనగామలి , నిజామాబాద్ 48 , సిద్దిపేట 14 , సూర్యాపేట 27 , గద్వాల 4 కేసులు నమోదయ్యాయి .

Related Articles

Back to top button