వరంగల్ లో ఘోర సంఘటన, family left deadbody at hospital
కరోనాతో చనిపోయిందని మహిళ మృతదేహాన్ని వదిలి వెళ్ళిన కుటుంబ సభ్యులు, family left deadbody at hospital మూడు గంటలపాటు వర్షంలోనే ఉన్న మృతదేహం.
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఆవరణలో అమాననీయ ఘటన చోటుచేసుకుంది . కరోనా సోకిందనే భయంతో ఆసుపత్రి ఆవరణలోని క్యాజువాలిటి ముందు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు వర్షంలోనే వదిలేసి వెళ్ళిపోయారు . సుమారు మూడు గంటలపాటు ఈ మృతదేహం క్యాజువాలిటి ముందే ఉండిపోయింది .
family left deadbody at hospital :
కరోనా సోకిందనే భయంతో ఓ మహిళ మృతి చెందడం దీంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పట్టించు కోకుండా వదిలేశారు . వర్షం తగ్గిన తర్వాత ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు ఈ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు . హన్మకొండకు చెందిన ఓ మహిళ శ్వాస సంబంధిత సమస్యతో ఎంజీఎంకు వచ్చింది . ఆమెకు చికిత్స అందించేలోపే కన్నుమూసింది . కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ఆ మహిళను కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకు వెళ్ళకుండా క్యాజువాలిటీ ముందు వర్షంలోనే వదిలేసి వెళ్ళిపోయారు . ఆస్పత్రి సిబ్బంది కూడా అటువైపు చూడలేదు . మూడుగంటలపాటు ఆవరణలోనే స్ట్రెచర్ పైనే మృతదేహం ఉంది . వర్షం తగ్గాక ఎంజీఎం సిబ్బంది మృతదేహాన్ని మార్చురీకి తరలించారు .