కేసిఆర్ పై బండి సంజయ్ ఘటు వ్యాఖ్యలు, Bandi Sanjay fires on KCR

 Bandi Sanjay fires on KCR కరోనా కేసులు , మరణాల విషయంలో చైనా ప్రభుత్వం ఎలాగైతే తప్పుడు సమాచారంతో ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించిందో ముఖ్య మంత్రి కేసీఆర్ .. రాష్ట్ర ప్రజలను , దేశాన్ని తప్పు దోవ పట్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు .

 కరోనా వ్యాప్తితో తెలంగాణాలో భయానక పరిస్థితి నెల కొందని , వైరస్ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసిందని , కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునే స్తోమత లేక ఎంతోమంది పేదలు ప్రాణాలు కోల్పోతుంటే , కేసీఆర్ మాత్రం , నైతిక విలువలు లేకుండా ఫాంహౌజ్ కే పరిమితమయ్యారని విమర్శించారు . “ మీ కుటుంబం , మీ వాళ్లు బాగుండాలి తప్ప ప్రజల బాగోగులు పట్టవా ? ” అని నిలదీశారు .

Bandi Sanjay fires on KCR :

 బుధవారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు . హెల్త్ బులెటిన్ లో వెల్లడించేవి వాస్తవాలే అయితే ఆ విషయాన్ని సీఎం తన గుండె లపై చేయివేసుకొని చెప్పాలని సవాల్ చేశారు . రాష్ట్రంలో శ్మశానవాటికల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి పరిశీలిస్తే సీఎం బండారం బయటపడు తుందన్నారు . వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తుంటే , చిన్న సమస్యగా చూపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం , అభివృద్ధి పేరిట కార్యక్రమాలు చేపడుతూ ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు . సీఎం బోగస్ .. మంత్రులు , ఎమ్మెల్యేలు , ప్రభుత్వం , హెల్త్ బులెటిన్ అంతా బోగస్ అని విమర్శించారు ‘ మీ దొంగ లెక్కలపై వాస్తవాలు గ్రహించి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తే , బరితెగించి ఆ కోర్టునే ప్రశ్నించే స్థాయికి ఎదిగారు ‘ అని విరుచు కుపడ్డారు .

 సీఎంకు , వైద్యశాఖ మంత్రికి మధ్య వైరుధ్యం నెలకొందని , ఆ కారణంగా పేదల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు . కరోనా రోగులకు చికిత్స పేరుతో కార్పొరేట్ ఆస్పత్రులు దోచుకుంటుంటే .. వాటి బిల్లులు చెల్లించలేక ప్రజలు చనిపోతున్న పరిస్థితి నెలకొందని , అంటూ ‘ మిమ్మల్ని ఎలా విశ్వసించాలి . సీఎంగా ఎలా గుర్తించాలి ‘ అని ప్రశ్నించారు .

Related Articles

Back to top button