మంచిర్యాలలో కొనసాగుతున్న కరోనా ఉదృతి, Mancherial district COVID19 update
మంచిర్యాల జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. Mancherial district COVID19 update ఆదివారం ప్రకటించిన కరోనా హెల్త్ బులిటెన్ లో ఏకంగా 27 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు పేర్కొన్నారు. బెల్లంపల్లి బజార్ ఏరియా లో రోడ్లు మూసివేశారు. అక్కడ కరోనా తీవ్రత ఎక్కువ ఉండటం వల్ల జనాలు బయటకు రావడానికి భయపడుతున్నరు.
బెల్లంపల్లి సహా మందమర్రి, శ్రీరాంపూర్ ల లో కూడా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.. జిల్లాలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో దాని బారి న పడిన వారికి ర్యాఫీడ్ కొవిడ్ యాంటీజెన్ టెను జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రారంభించడానికి వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమవుతోంది . అన్ని పీ హెచ్ సీల్లో ఏర్పాటుచేయాలంటే పక్షం రోజుల సమయం పట్టే అవకాశం ఉంది . జిల్లాలో 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా ఇప్పటికే కొన్ని ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్ పరీక్షలు ప్రారంభించారు . దీనికి సంబంధించిన ఏర్పాట్లతోపాటు ల్యాబ్ టెక్నిషన్ల అవసరం ఎక్కువ ఉంటుంది . ల్యాబ్ టెక్నిషన్లలో ఇప్పటికే కొందరికి శిక్షణ ఇచ్చారు . ఇందుకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది . అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఆన్లైన్ పద్ధతి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది .
Mancherial district COVID19 update ::
కరోనా లక్షణాలు ఉంటేనే మెడికల్ ఆఫీసర్ నిర్ణయం తీసుకుని వారి వివరాలను ఆన్లైన్లో రిజిస్టర్ చేస్తారు . ఆన్‌లైన్ చేసి తరువాత అతనికి ఓటీపీ నంబరు వస్తుంది . ఆ నంబరు వచ్చిన తరువాత బాధితుడికి కరోనా పరీక్ష చేస్తారు . ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోతే వెంటనే అతన్ని ఐసోలేషన్ కేంద్రానికి తరలిస్తారు . పాజిటివ్ వచ్చిన వారితో ఉండే ప్రైమరీ కాంటాక్ట్ తో పాటు జలుబు , జ్వరం , దగ్గు , విరోచనాలు ఉండి వారం రోజు లు మందులు వాడినా నయం కాకపోతే వారికి కొవిడ్ పరీక్షలు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది .
పాజిటివ్ వచ్చిన వారికి అన్ని రకాల మందులతో కూడిన హోం ఐసోలేషన్ కిట్స్ త్వరలో రానున్నాయి . ఈ విషయమై డీఎంహెవో నీరజను సంప్రదించగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మొదలు అవుతుందని , అందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు . లక్షణాలు ఉన్న వారికి మాత్రమే పరీక్షలు చేస్తారన్నారు . కరోనా బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల ఆరా నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని నాగార్జున కాలనీ , పాత నాగార్జు న కాలనీ , షిర్కే కాలనీ , నస్పూర్ ఏరియాల్లో కరోనా బారిన పడి హోం క్వారం టెన్లో ఉన్న బాధితుల ఆరోగ్య పరిస్థితిపై కొవిడ్ మానిటరింగ్ అధికారి డాక్టర్ అనిత శనివారం వారి ఇళ్ళకు వెళ్ళి తెలుసుకున్నారు . వారికి సూచనలు సలహాలను ఇచ్చి అవసరమైనా మందులను అందించారు . ఏదైనా సమస్య వచ్చినట్లయితే తక్షణమే సమాచారం ఇవ్వాలని సూచించారు .