ఇలా కూడా కరోనా వస్తుందట, Coronavirus transmission

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా గుట్టు ఒక్కోటి తెలుస్తున్న కొద్దీ భయాందోళనలు పెరిగిపోతున్నాయి . Coronavirus transmission ఇప్పటివరకు ఈ వైరస్ మనిషి శరీరంలోని ఊపిరితిత్తులు , గొంతు , ముక్కునూ ఆయిస్తుందని , మరీ ముదిరితే శరీరంలోని మరి కొన్ని భాగాలపై ప్రభావం చూపుతుందని తెలుసు . కానీ ఆ వైరస్ చివరకు మనిషి చెవి ( మధ్యచెవి ) లోను , వెనుక ఉండే బోలు ఎముక ( మాస్టాయిడ్ – తల వెనుక ఉండే మెదడులోని భాగం ) లోనూ చేరి సమస్యలు సృష్టిస్తోందని తాజా అధ్యయనంలో తేలింది . ప్రఖ్యాత విజ్ఞానశాస్త్ర జర్నల్ ( జామా – జెఎఎమ్ఎ ) లో ఈ మేరకు పరిశోధనల వివరాలు ప్రచురించారు .

చెవిలో ఆ వైరస్ చేరితే , చెవి వ్యాధులకు సంబంధించిన శస్త్రచికిత్సలను వాయిదా వేసుకోవాల్సిందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు . కరోనా వైరస్ సోకడంతో మరణించిన ముగ్గురి మృతదేహాలలో చెవి భాగాలను పరిశీలించగా ఈ విషయం ధ్రువపడింది . వీరిలో ఇద్దరికి చెవిలోను లేదా మాస్టాయి లోను వైరస్ ఉన్నట్లు తేలింది . ముగ్గురు కరోనా మృతుల దేహాలలోని చెవి భాగాలను సేకరించిన ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఈ పరిశోధనలు చేసింది .

Coronavirus transmission ::

మొదటిరోగికి కుడి చెవిలోని మధ్య చెవిలోను , ఆరు మాస్టాయిడ్ లలో రెండింటిలోనూ వైరస్ ఆనవాళ్లు కనిపించాయి . అలాగే రెండో రోగికి మధ్యచెవిలో రెండుచోట్ల ఆ వైరస్ ఉన్నట్లు గుర్తించారు . మూడోరోగి కరోనాతో మరణించినప్పటికీ చెవిలోకాని , మాస్టాయి లో కానీ వైరస్ ఆనవాళ్లు లేవు . ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కళ్లు , ముక్కు , నోటి ద్వారా వైరస్ ప్రవేశించకుండా మాస్క్ లను వాడుతున్నట్లు ఇకముందు చెవులను కవర్ చేసుకోక తప్పదని ఈ వైద్యనిపుణుల బృందం హెచ్చరిస్తోంది . ఇతర శస్త్రచికిత్సల చేయాల్సిన తరుణంలో కోవిడ్ పరీక్షలు నిర్వహించడం , మార్గదర్శకాలు పాటించడం ఎలా తప్పనిసరో , చెవికి సంబంధించిన చికిత్సల్లోనూ ఆ ప్రమాణాలను పాటించాలని వారు సూచిస్తున్నారు .

Related Articles

Back to top button