తెలంగాణలో ఆగని కరోనా వ్యాప్తి, COVID19 pandemic in Telangana

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది . COVID19 pandemic in Telangana ప్రజలు , ప్రభుత్వం ఎంత అప్రమత్తంగా ఉన్నా , ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్ వ్యాప్తి జరుగుతూనే ఉంది . రాష్ట్రంలో కొత్తగా 1473 మందికి కరోనా మహమ్మారి సోకింది . శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఆదివారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో 1473 మందికి కరోనా వైరస్ సోకింది . ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెను కొత్త ఫార్మాట్లో ఆదివారం ఉదయం విడుదల చేసింది .

 కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 55,532 కి చేరింది . గడిచిన 24 గంటల్లో 774 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు . వీరి సంఖ్యను కలుపుకుంటే ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లిన వారి సంఖ్య 42,106 కు చేరుకుంది . ఇప్పటికీ కరోనా సోకడంతో వివిధ ఆసుపత్రుల్లో 12 , 955 మంది చికిత్స పొందుతున్నారు . కాగా … ఆదివారం రాత్రి 8 గంటల వరకు కోవిడ్ -19 సోకి చికిత్స పొందినప్పటికీ ఎనిమిది మంది ప్రాణాలు విడిచారు . ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 471 కు చేరింది . రాష్ట్రంలో కోవిడ్ మరణాలు ఒక శాతం కన్నా తక్కువగా ఉన్నాయి . అదే సమయంలో దేశ కోవిడ్ మరణాల శాతం 2.3 శాతంగా నమోదైనట్లు వైద్య , ఆరోగ్యశాఖ వెల్లడించింది . మరోవైపు రాష్ట్రంలో శనివారం ఒక్కరోజే 9,817 కరోనా టెస్టులు నిర్వహించగా , వీటిలో 1473 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది . దీంతో ఇప్పటివరకు తెలంగాణాలో చేసిన కరోనా టెస్టులు సంఖ్య 8,58,425 కు చేరింది . తెలంగాణాలో సరాసరి ప్రతి 10 లక్షల మందిలో శనివారం 391 మంది కరోనా టెస్టులు చేసినట్లు ఆ బులెటిన్లో వివరించారు . ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 39 చోట్ల కరోనా పరీక్షలు జరుపుతున్నట్లు హెల్త్ బులెటిన్లో వివరించారు .

COVID19 pandemic in Telangana ::

 శనివారం రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో వందక ఎపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా , మరో మూడు జిల్లాలో 50 కి పైగా కేసులు నమోదయ్యాయి . కొత్తగా పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 506 కేసులు నమోదు కావడం గమనార్హం . ఆ తర్వాత స్థానంలో రంగారెడ్డి జిల్లా ఉంది . ఈ జిల్లాలో 168 కొత్త కేసులు నమోదు కాగా , వరంగల్ అర్బన్ జిల్లాలో 111 కేసులు , మేడ్చల్ లో 86 కేసులు నమోదయ్యాయి . మిగతా జిల్లాల్లో … సంగారెడ్డి 98 , కరీంనగర్ 91 , నాగర్ కర్నూల్ 19 , మహబూబ్ నగర్ 36 , కామారెడ్డి 17 , నిజామాబాద్ 41 ,  మంచిర్యాల 14  , జనగామ 10 , మెదక్ 17 , వరంగల్ రూరల్ 8 కేసుల చొప్పున , ఖమ్మం 17  , పెద్దపల్లి 0 , ఆదిలాబాద్ 28 , ములుగు 12 , యాదాద్రి భువనగిరి 11 , వికారాబాద్ 2 , నారాయణపేట 2 , నల్గొండ 28  , సిద్దిపేట 12 చొప్పున , భూపాలపల్లి 0 ,  కేసులు నమోదయ్యాయి . కాగా ఆసిఫాబాద్ జిల్లాలో ఆదవారం ఒక కేసు కూడా నమోదు కాలేదు .

కోవిడ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 17081 బెడ్లలో 14,947 బెడ్లు అందుబాటులో ఉన్నాయి . 2184 బెడ్లలో పేషెంట్లు చికిత్స పొందుతున్నారు . గాంధీలో 1890 బెడ్లకుగాను 1075 ఖాళీగా ఉన్నాయి . ఇక టెస్టుల విషయానికి వస్తే … ఆర్టీపీసీఆర్ , సీబీనాట్ , ట్రూనాట్ టెస్టులను ప్రభుత్వ ఆధ్వర్యంలోని 16 సెంటర్లలో , 23 ప్రయివేటు సెంటర్లలో నిర్వహిస్తున్నారు . ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులను మాత్రం 320 ప్రభుత్వ కేంద్రాల్లోనే చేస్తున్నారు . అదే సమయంలో జిల్లాల వారీగానూ … కరోనా నిర్ధారణా పరీక్షా కేంద్రాల వివరాలను హెల్త్ బులిటెన్లో పేర్కొన్నారు . జిల్లా ఆసుపత్రులతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వివరాలు కూడా ఉన్నాయి . టెస్టింగ్ సెంటర్ల వివరాల కోసం బాధితులు తెలంగాణ వైద్య , ఆరోగ్యశాఖ వెబ్ సైట్ ను సంప్రదించాలని అధికారులు సూచించారు .

Related Articles

Back to top button