మంచిర్యాల లో విజృంభిస్తున్న కరోనా, Mancherial COVID19 positive cases
జిల్లాలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది .. Mancherial COVID19 positive cases ఇప్పటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య డబుల్ సెంచరీ దాటగా .. ఇద్దరు మృత్యువాత పడ్డారు .. పట్టణాలతో పాటు పల్లెల్లో సైతం మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తుండడం కలకలం సృష్టిస్తోంది .
తాజాగా శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో 29 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా , మరో ఇద్దరు మృతి చెందారు . దీంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరగా , కరోనా వైరస్ బాధితుల సంఖ్య 262 కు చేరింది .. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది 149 మంది డిశ్చార్జి అయ్యారు . ఆదిలాబాద్ జిల్లాలో మరో ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి .. నిర్మల్ జిల్లాలో శనివారం 51 మంది రక్త నమూనాలను సేకరించగా అందులో ఐదుగురికి పాజిటివ్ నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు . ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతుండడంతో పరిస్థితులు భయానకంగా మారాయి .
Mancherial COVID19 positive cases :
సుమారు మూడు నెలల పాటు కరోనా వైరస్ వ్యాప్తి నిలిచిపోగా .. సడలింపుల తర్వాత క్రమక్రమంగా కరోనా మహమ్మారి జూలు విదిల్చిన తీరు ఉమ్మడి జిల్లా వాసులను కలవరానికి గురిచేస్తోంది .
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరీనా మహ మ్మారి రోజురోజుకు విస్తరిస్తుంది . ప్రతీ రోజు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి . జనసంచారం కూడ బాగానే పెరిగింది . ఎప్పు డు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయ0 ప్రతీ ఒక్కరిలో ఉంది . ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలు ఎక్కువ సంఖ్యలో రాకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు . అవసరాల కోసం కార్యాలయాలకు వచ్చే వారి ని ఎవరిని కూడ కార్యాలయాల్లోకి అనుమతించడం లేదు . కార్యాలయం ఎదుటనే ఒక డబ్బాను పెట్టి అందులో దరఖాస్తులు వేయా లని అధికారులు సూచిస్తున్నారు .
కరోనా జాగ్ర త్తల పేరిట ప్రజలను ఆఫీసుల్లోకి రాకుండా అడ్డుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం కరోవా పాజిటివ్ యాక్టివ్ కేసులు 170 ఉన్నాయి . ఇందులో మంచిర్యాల లలో 94 , రొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 36 , ఆదిలాబాద్ జిల్లాలో 22 , నిర్మల్ జిల్లా లో 18 యాక్టివ్ కేసులు ఉన్నాయి . ఆదిలాబా ది , ఆసిఫాబాద్ , కాగజ్ నగర్ , బెజ్జూరు , దహి గాం , జైనూర్ , నిర్మల్ , టైంసా లాంటి ప్రాంతాల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమైంది . రోజు వారి భూసమస్యలు , షాదిముబారక్ , కళ్యాణ లక్ష్మి , కుల ధ్రువీకరణ , ఆదాయ ధ్రువీ కరణ పత్రాలు ఇతర పనుల కోసం తహసీ ల్దార్ కార్యాలయాలకు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు . అత్యవసరమైన పనులు అయితే మెయిల్ చేయాలని సూచించగా , సాధారణ సమస్యల దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక డబ్బాలు ఏర్పాటు చేయడం వల్ల వివిధ పనుల కోసం వచ్చే ప్రజలు వెనుదిరగాల్సి వస్తుంది .