ప్రభాస్ కు హీరోయిన్ గా బాలీవుడ్ భామ, Prabas new movie heroine

ప్రభాస్ , నాగ్ అశ్విన్ కాంబినేషన్లో ఓ సినిమాని వైజయంతి మూవీస్ సంస్థ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం విదితమే . Prabas new movie heroine ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ కథానాయిక దీపికా పదుకొనె నటించనుందని చిత్ర బృందం ఆదివారం అధికారికంగా తెలిసింది .

 సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కబోయే ఈ సినిమా గురించి , ఈ సినిమాలో నటిస్తున్న ప్రభాస్ , దీపికా జంట గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ , ‘ ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపిక చేయనుండటం నన్నెంతో ఎకైటింగ్ కు గురి చేస్తోంది . ఇది వరకు మెయిన్ స్ట్రీమ్స్ లో ఇలాంటి కాంబినేషన్ సంభవించలేదు . అందువల్ల అందరికీ ఇది ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది . ఈ సినిమాలోని మెయిన్ హైలైట్స్ లో దీపిక , ప్రభాస్ జంటగా కనిపించడం ఒకటి . వాళ్ల మధ్య నడిచే కథ రానున్న సంవత్సరాల్లో ప్రేక్షకుల హృదయాల్లో గాఢమైన ముద్ర వేస్తుందని నేను నమ్ముతున్నాను ‘ అని చెప్పారు . ‘

Prabas new movie heroine ::

 ఇండియన్ సినిమా హిస్టరీపై చెరగని ముద్ర వేసిన వారి జాబితాలో మా స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ఈ సినిమా మాకో సువర్ణావకాశం . అలాగే , అసాధారణ సినిమాటిక్ టాలెంటు కలపడం ద్వారా భారతీయ ప్రేక్షకులకు ఇదివరకెన్నడూ రుచిచూడని అనుభవాన్ని ఇచ్చేందుకు కూడా ఇది మాకో గొప్ప అవకాశం ‘ అని నిర్మాత , వైజయంతీ మూవీస్ వ్యవస్థాపకులు సి . అశ్వినీదత్ తెలిపారు . సహ నిర్మాతలు స్వప్నా దత్ , ప్రియాంకా దత్ మాట్లాడుతూ , “ ఇలాంటి గొప్ప , ఉద్వేగభరిత న్యూతో భారతీయ సినిమా మరపురాని 50 సంవత్సరాల ప్రయాణాన్ని సెలబ్రేట్ చేసుకుంటుండటం అమితమైన థ్రిల్ ను కలిగిస్తోంది . నాగ్ అశ్విన్ ఫిల్మ్ లో , ప్రభాతో తెరపై ఒక అసాధారణ మ్యాజిక్ ను క్రియేట్ చేయడానికి దీపికా పదుకొనే లాంటి అద్భుతమైన నటిని తీసుకురావడం కంటే మా గోల్డెన్ జూబిలీ మార్క్ కు ఇంకేం కావాలి ‘ అని చెప్పారు .

Back to top button