మంచిర్యాల లో కరోనా ఉదృతి, Mancherial COVID cases

మంచిర్యాల జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి కొన సాగుతోంది . Mancherial COVID cases జిల్లాలో రోజు రోజుకూ బాధితులు , అనుమానితులు పెరిగిపోతున్నారు . ఆదివారం ఏకంగా 14 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రభుత్వ , ప్రైవేటు , సింగరేణి , సామాన్య ప్రజలతో పాటు ప్రభుత్వశాఖల్లో పనిచేసే ఉద్యోగులూ మహమ్మారి బారిన పడుతున్నారు .

 ప్రతిరోజూ జిల్లాలో కొత్తగా పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి . కరోనాతో ఇప్పటికే జిల్లాలో నలుగురు మృతిచెందారు . మరోవైపు భూగర్భ గనుల్లో సామూహికంగా విధులు నిర్వర్తించే కార్మికుల్లో ఆందోళన నెల కొంది . తోటి కార్మికుల్లో ఎవరికైనా కరోనా సోకితే మిగతా కార్మికులు విధులకు వెళ్లేం దుకు జంకుతున్నారు . విధులకు వెళ్లబోమని గనుల వద్ద నిరసన తెలుపుతున్నారు.

Mancherial COVID cases ::

హాజీపూర్ మండలం లోని నంనూర్ గ్రామానికి చెందిన ఓ ప్రజాప్రతినిధికి కరోనా పాజిటివ్ వచ్చింది . గుడిపేటకు చెందిన ఓ కిరాణా దుకాణ యజమానికి వైరస్ సోకింది . అతనితో నంనూరు కు చెందిన ప్రజాప్రతినిధి కూడా దగ్గరగా ఉన్నట్లు తెలిసింది . అయితే రెండు రోజులుగా జ్వరం , శ్వాస తీసు కోవడంలో ఇబ్బంది పడుతూ ఉండగా కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానం రావడంతో ఆదివారం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో కోవిడ్ పరీక్ష చేయించుకోగా పాజిటి వ్ గా తేలింది . వెంటనే ఆ ప్రజాప్రతినిధి బెల్లంపల్లి ఐసోలేషకు వెళ్లి చికిత్స పొందుతున్నాడు . అతని కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్ చేసినట్లు తెలిసింది . కాగా సోమవారం పంచాయతీ ఆధ్వర్యంలో ఆ ప్రాంతంలో సోడియం హైపోక్లోరైడ్ స్పే చేయనున్నారు . గుడిపేట , నం నూర్ లో ఇద్దరికి కరోనా రావడంతో మరోసారి మండల ప్రజలు ఉలిక్కిపడ్డారు . బెల్లంపల్లిలో మరో ముగ్గురికి .. 

 బెల్లంపల్లిలో ముగ్గురికి పాజిటివ్ వచ్చింది . రాంనగర్బస్తీలో క్యాటరింగ్ పనులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తికి కరోనా సంక్రమించగా , బజారు ఏరియాలోని ఓ స్టీల్ షాపులో పనిచేస్తున్న హన్మ్బాస్తీకి చెందిన ఓ గుమాస్తాకు , స్టేషన్లోడ్ కాలనీలో నాలుగు నెలల గర్భిణికీ పాజిటివ్ రావడం కలకలం రేపింది . ఈ మేరకు సదరు వ్యక్తులు నివాసం ఉంటున్న ఆయా ప్రాంతాలను ఏఎస్సై లింగన్న పర్యవేక్షణలో కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి తగిన చర్యలు తీసుకున్నారు . ముఖ్యంగా ఆ మార్గాల్లో ఇతర వ్యక్తులు ఎవరూ రాకపోకలు సాగించకుండా రోడ్డుకు అడ్డంగా చెట్ల కొమ్మలు వేసి బారికేడ్లను ఏర్పాటు చేసి నియంత్రించారు . సదరు పాజిటివ్ రిపోర్టు వచ్చిన వ్యక్తుల కుటుంబ సభ్యులను హోం ఐసోలేషన్ పాటిం చాల్సిందిగా సూచించారు .

 రామకృష్ణాపూర్ లో మహిళ మృతి రామకృష్ణాపూర్ : పట్టణంలోని బీజోన్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ ( 58 ) కరోనాతో ఆదివారం మృతి చెందింది . కొద్ది రోజుల క్రితం పాజిటివ్ రావడంతో హోం క్వారం ట్రైన్ లోనే ఉంది . కాగా వ్యాధి తీవ్రత పెరిగి తీవ్ర అస్వస్థ తకు గురికావడంతో రెండ్రోజుల క్రితం ఆమెను హైద రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు . అక్కడ చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం ఉదయం మృతి చెం దింది . కాగా మృతురాలి భర్తకు కూడా ఇటీవలే కరోనా సోకగా హోం క్వారంటైన్లో ఉన్నాడు .

Related Articles

Back to top button