లైవ్ లో రైతు ఆత్మహత్య, farmer suicide in Telangana
వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన farmer suicide in Telangana దళిత రైతు నర్సింలు మృతి దురదృష్టకరమని , ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు . ఇది విపక్షాల రాజకీయ ప్రేరేపిత హత్య అని , శవాలపై పేలాలు ఏరుకునే నీచ రాజకీయాలు చేయవద్దని హితువుపలికారు .
2014 ఫిబ్రవరిలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వేలూరు గ్రామానికి చెందిన బ్యాగరి నర్సింలు 4 ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన రాజేశంగౌడ్ కొనుగోలు చేయగా ఎకరం భూమి అసైన్మెంట్ ఉండడంతో ఆ భూమిని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం , అప్పటి తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకుందని , అందులో 25 గుంటలు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సబ్స్టేషన్ నిర్మాణం చేపట్టారన్నారు . ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నాడని , ఈ విషయం ఉత్తమకు తెలియదా అని ప్రశ్నించారు . రాజకీయ లబ్ధి కోసం రాజేశంగౌడ్ , ఇతర కాంగ్రెస్ నాయకులు నర్సింలు ప్రేరేపించారన్నారు . దీనిపై పోలీసులచే లోతైన విచారణ చేయాలని ఆదేశించా మన్నారు . దోషులు తేలిన తర్వాత కఠినంగా శిక్షిస్తామన్నారు .
farmer suicide in Telangana ::
విపక్షాలు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నాయని , వాస్తవాలు తెలుసుకోకుండా మంచిచెడు విచారించకుండా ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయన్నారు . అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి , బిజేపీ నాయకులు హడావుడి ప్రకటనలు చేయడం సిగ్గుచేటన్నారు . నర్సింలు కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుం టామని , మృతుని కుటుంబానికి రూ .2 లక్షలతో పాటు ఎకరం భూమి , కూతురును చదివిస్తామని మంత్రి హామీ ఇచ్చారు . వేలూరులో సబ్ స్టేషన్ నిర్మాణం పోనూ మిగతా 15 గుంటల భూమిలో ఇటీవల ఎడీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి రైతువేదికకు శంకుస్థాపన చేశారన్నారు .