Trending

మంచిర్యాలలో కొనసాగుతున్న కరోనా ఉదృతి, Mancherial corona cases

 Mancherial corona cases  జిల్లాలో 6 కోవిడ్ -19 పాజిటివ్ కేసుల నమోదు – 233 కు చేరిన బాధితుల సంఖ్య  ,  జిల్లాలో రోజు రోజుకు కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య పెరుగుతుంది .. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన వివరాల్లో మందమర్రికి సంబంధించి మారుతీనగర్‌లో ఒకరికి , వజీర్ సుల్తాన్ కాంప్లెక్స్ లో ఇద్దరికి , నస్పూర్ మండలంలోని నాగార్జున కాలనీలో ఒకరికి , బెల్లంపల్లిలో బజారు ఏరియాలో ఇద్దరికి కరోనా వైరస్ సోకినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టు నీరజ పేర్కొన్నారు .

 జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 233 మందికి కరోనా వ్యాది సోకగా 140 మంది ఆసుపత్రిలో చికిత్స పొంది డిశార్జ్ అయ్యారు . 85 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు . ఇతర జిల్లాల్లో నివసిస్తున్న మంచిర్యాల జిల్లాకు చెందిన వ్యక్తికి కరోనా వ్యాది సోకినట్లు అధికారులు పేర్కొన్నారు .

Mancherial corona cases ::

బెల్లంపల్లి పట్టణం కరోనా భయంతో విలవిలలాడుతోంది . బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని , 65 డిపో , ఇంజిన్ , కాంట్రాక్టర్ , స్టేషన్ రోడ్ కాలనీ , హనుమాన్ బస్తీలలో కరోనా మహమ్మారి విజృంభనతో కంటైన్ మెంట్ జోన్లుగా ప్రకటించినప్పటికీ బజారు ఏరియాలోని నెల్కో లైన్లో ఒక వ్యాపారికి కరోనా సోకడంతో పాటు , అదే ఏరియాలో మరో ఇద్దరికి పాజిటీవ్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించడంతో బెల్లంపల్లి బజారు ఏరియా అంతా భయం భయంగా పోలీసులు , వైద్యాధికారులు నెల్కో లైన్ ను బ్లీచింగ్ చేయించి కంటైన్మెంట్ జోన్లుగా ఏర్పాటు చేసి భ్రికేట్లను ఏర్పాటు చేశారు . దుకాణదారులు వారం రోజుల పాటు తెరవద్దని ఆదేశాలను జారీ చేశారు . .

Related Articles

Back to top button