తెలంగాణా పదోవ తరగతి పరీక్షలు వాయిదా, TS 10th exams postponed

Headlines::

  • పదవ తరగతి పరీక్షలు వాయిదా , TS 10th exams postponed
  •  హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
  •  23 నుంచి 30 వరకు జరగాల్సిన పరీక్షలు నిలిపివేత 
  • నేడు జరిగే పరీక్ష మాత్రం యథాతథం 
  • వాయిదాపడ్డ పరీక్షల నిర్వహణ ఎప్పుడో తర్వాత చెబుతామన్న సర్కారు

 ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను రప్పించడం సరికాదని , వాయిదా వేయాలని హైకోర్టు శుక్రవారం ఆదేశించడంతో ఈ నెల 29 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించాల్సిన పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది .

అయితే శనివారం జరిగే పరీక్షను వాయిదా వేయాలని హైకోర్టు చెప్పనందున ఆ పరీక్షను మాత్రం యథాతథంగా నిర్వహించ నుంది . వాయిదా పడిన పరీక్షల తేదీలు ఖరారు చేయాల్సి ఉంది.
పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహించేదీ తర్వాత తెలియజేస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరె క్టర్ ఎ . సత్యనారాయణరెడ్డి తెలిపారు .

హైకోర్టు రాష్ట్రంపై కరోనా ప్రభావం కొనసాగుతున్నప్పటికీ 10వ తరగతి పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై హైకోర్టు అంతకుముందు విచారణ చేపట్టింది . ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు జరగాల్సిన TS 10th exams postponed వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది .

ఈ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని స్పష్టం చేసింది . ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 6లోగా పరీక్షలను నిర్వహించే అవకాశాలను పరిశీలించాలని పేర్కొంది . ఒకవేళ పరిస్థితి ఆందోళనకరంగా ఉంటే ఆ తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేస్తుందని ఆశిస్తున్నామని హైకోర్టు తెలిపింది .

Recent posts::

Related Articles

Back to top button