Trending

తెలంగాణలో కరోనా విజృంభణ, CoVID19 cases in TS

 రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది . ప్రభుత్వ ఉద్యోగులను , వైద్యులను , పోలీసులను , జర్నలిస్టులను , ప్రజాప్రతినిధులను కూడా వీడటం లేదు . CoVID19 cases in TS శుక్రవారంనాడు 1640 మందికి కరోనా పాజి టివ్ నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది . ఇందులో జిహెచ్ఎంసిలో పరిధిలో 683 మంది కరోనా పాజిటీవ్ వచ్చిన వారు ఉన్నారు .

కరోనాతో మృత్యువాత పడిన వారి సంఖ్య 455 కి చేరింది . ఇంకా 11,677 ( 22.1 శాతం ) మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు . పాజిటీవ్ కేసుల సంఖ్య ఇప్పటికీ హైదరాబాద్ లోనే ఎక్కు వగా నమోదవుతున్నాయి . ఇంకా కరోనా పరీక్షల ఫలితాలు కొన్ని రావాల్సి ఉంది . సచివాలయంతో సహా జిహెచ్ఎంసీలోనూ , ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కరోనా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి .

CoVID19 cases in TS ::

 రంగారెడ్డిలో 135 , మేడ్చల్ లో 30 , సంగారెడి లో 102 , ఖమ్మంలో 13 , కామారెడ్డిలో 56 , వరంగల్ అర్బన్లో 36 , వరంగల్ రూరల్ లో 22 , నిర్మల్లో 1 , కరీంనగర్ లో 100 , జగిత్యాలలో 17 , యాదాద్రి భువనగిరిలో 1 , మహబూబా బాయ్ 44 , పెద్దపల్లిలో 98 , మెదక్ లో 22 , మహబూబ్ నగర్ లో 11 , మంచిర్యాలలో 7 , బద్రా ద్రి కొత్తగూడెంలో 11 , జయశంకర్ భూపాల్లిలో 24 , నల్లగొండలో 42 , రాజన్న సిరిసిల్లలో 20 , ఆదిలాబాద్లో 9 , వికారాబాద్లో 8 , నాగర్ కర్నూలులో 52 , జనగామ్ లో 10 , నిజామా బాద్ లో 18 , ములుగులో 14 , సిద్దిపేటలో 8 , సూర్యపేటలో 11 , జోగులాంబ గద్వాలలో 7 పాజిటీవ్ కేసులు నమోదయ్యారు . కరోనా కారణంగా ఇదే రోజు 8 మంది మృతి చెందారు . ఈ ఒక్క రోజులో 1,007 మంది డిశ్చార్జ్ అయ్యారు . రాష్ట్రంలో ఇప్పటి వరకు 52,466 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి . కోలుకున్నవారి సంఖ్య 40,334 ( రికవరీ రేటు 76.8 శాతం ) కు చేరింది . 

 వైద్య సిబ్బందికి కూడా కరోనా సోకుతుంది . వారు కోలుకున్నారు . పలువురు మంత్రులకు , ఎమ్మెల్యేలకు కరోనా సోకగా , వారు కోలుకున్నారు . గవర్నర్ కార్యాలయం రాజ భవన్లో 48 మందికి కరోనా పాజి టివ్ వచ్చింది . కరోనా సోకిన వారిలో ముగ్గురు , నలుగురు అధికారులు కూడా ఉన్నారు . దాదాపుగా అందరూ కోలుకుని విధుల్లో చేరారు . అసెంబ్లీలో ఎమ్మెల్యే హాస్టళ్లలో ఇంత వరకు ఒక్క కరోనా పాజి టీవ్ కేసు కూడా నమోదు కాలేదు . అక్కడ కరోనా వ్యాప్తి నివారణ చర్యలు కఠినంగా నిర్వహిస్తున్నారు . ఎప్పటికప్పుడు సానిటైజ్ చేస్తున్నారు . హైదరాబాద్ కరోనా విస్తృతి పెరుగుతున్న నేవ థ్యంలో సచివాలయంతో సహా ఇతర ప్రభుత్వ ఉద్యోగుల విధుల నిర్వహణకు సంబంధించి నూతన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడు దల చేసింది . 50 శాతం ఉద్యోగులు వారం విడిచి వారం , మరో 50 శాతం ఉద్యోగులు రోజు విడిచి రోజు విధులు నిర్వహించాలని సూచించారు.

Related Articles

Back to top button