IPL 2020 తేదీల విడుదల, IPL 2020 schedule released

 క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ ( IPL 2020 schedule released ) నిర్వహణకు సంబంధించి చైర్మన్ బ్రిజేష్ పాటిల్ పలు కీలక విషయాలను వెల్లడించారు . యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు లీగన్ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు .

ఈ సారి మొత్తం 8 టీంలు లీగ్ బరిలో నిలుస్తాయని , నవంబర్ 8 న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని స్పష్టం చేశారు . కరేబియన్ లీగ్ సెప్టెంబర్ 10 ముగుస్తుంది . అలాగే ఇంగ్లండ్ – ఆస్ట్రేలియా సిరీస్ అదే నెల 15 న ముగియనుంది . ఈ మూడు దేశాల ఆటగాళ్లు వెసులుబాటుకు దృష్టిలో ఉంచుకుని షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తాం అని పాటిల్ తెలిపారు . దీనిపై బీసీసీఐ గవర్నర్ కౌన్సిల్ సమావేశంలో చర్చించిన అనంతరం తుది నిర్ణయం ప్రకటిస్తామన్నారు . మొత్తం 51 రోజుల పాటు లీగను నిర్వహించే విధంగా షెడ్యూల్‌ను తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు . ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఓ సమావేశం అనంతరం బ్రిజేష్ పాటిల్ మీడియాతో మాట్లాడారు . కాగా టీ -20 ప్రపంచ్ కప్ వాయిదా పడటంతో ఐపీఎల్‌ను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే . అయితే భారత్ లో కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో విదేశాల్లో లీగను నిర్వహించాలని భావించింది . దీనిలో భాగంగానే లీగ్ నిర్వహణకు యూఏఈ అనువైన ప్రదేశంగా గుర్తించింది . 

IPL 2020 schedule released ::

 కరోనా విజృంభణ కారణంగా ఆస్ట్రేలియా వేదికగా సెప్టెంబర్ నుంచి ప్రారంభం కావాల్సిన టీ -20 ప్రపంచ కప్ ను వాయిదా వేస్తున్నట్లు ఐసీసీ ఇటీవల అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే . ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహించకపోతే రూ . 4 వేల కోట్ల వరకు నష్టం చవిచూడాల్సి వస్తుందని లెక్కలేసిన బీసీసీఐ .. ఐసీసీ నిర్ణయంతో ఆ  సమయంలో లీగ్ ను నిర్వహించాలని నిర్ణయించింది . ఆరంభ మ్యాచ్ సెప్టెంబరు 19 న ఉంటుందని , టోర్నీ మెగా ఫైనల్ నవంబరు 8 న జరుగుతుందని బ్రిజేశ్ పటేల్ వివరించారు . త్వరలోనే ఐపీఎల్ పాలకమండలి సమావేశం జరుగుతుంది . ఈ సమావేశంలో చర్చించి ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ ను ఖరారు చేయనున్నారు .

 ప్రభుత్వ అనుమతులు కూడా వస్తాయని భావిస్తున్నాం . కరోనా పరిస్థితుల నడుమ టోర్నీ   నిర్వహిస్తున్నాం కాబట్టి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ( ఎఓపీ ) ను రూపొందిస్తున్నాం . అయితే , ఐపీఎల్ మ్యాచ్ లు ప్రేక్షకులతో జరపాలా ? ప్రేక్షకులు లేకుండా జరపాలా ? అనేది యూఏఈ ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది . ఏదేమైనా భౌతికదూరం మాత్రం పాటించి తీరాల్సిందే . అందుకే ప్రేక్షకులను అనుమతించే విషయం అక్కడి ప్రభుత్వ నిర్ణయానికే వదిలేస్తున్నాం . మా వంతుగా యూఏఈ క్రికెట్ బోర్డుకు ఓ లేఖ రాస్తాం అని వివరించారు . కాగా , క్రికెట్ అభిమానులు ఎంతగానో ఇష్టపడే ఐపీఎల్ ( ఇండియన్ ప్రీమియర్ లీగ్ ) కు మార్గం సుగమమైంది . సంవత్సరం సెప్టెంబర్ లో జరగాల్సిన వరల్డ్ కప్ టీ -20 క్రికెట్ కరోనా కారణంగా రద్దు కావడంతో , ఆ సమయంలో ఐపీఎల్ పోటీలను నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు శరవేగంగా చేస్తోంది . ఈ సంవత్సరం ఇండియాలో పోటీలు నిర్వహించేందుకు పరిస్థితులు అనువుగా ఉండవని భావిస్తున్న అధికారులు , పోటీలను యూఏఈలో జరపాలని నిర్ణయించింది . 

Related Articles

Back to top button