Trending

మంచిర్యాలలో ఆగని కరోనా వ్యాప్తి, Mancherial COVID19 update

 Mancherial COVID19 update  జిల్లాలో గురువారం 1  పాజిటివ్ కేసు  నమోదు అయింది . చెన్నూర్ లో 18 మంది నమూనాలను పరిశీలించగా 1పాజి టివ్ గా తేలింది .  ఇప్పటివరకు జిల్లాలో లోకల్ పాజిటివ్ 309 కేసులు , మైగ్రేన్ పాజిటివ్ 39 కేసులు నమోదయ్యాయి . 682 నమూనాలను పరిశీలించగా 421 నెగెటివ్ వచ్చాయి . హోంక్వారం టైలో 1,231 మంది , ఐసోలేషన్లో 48 మంది ఉన్నారు . 187 మంది డిశ్చార్జి కాగా యాక్టివ్ కేసులు 141 ఉన్నాయి .

 రామ కృష్ణాపూర్ పట్టణంలో పది మందికి కరోనా సోకినట్లు వైద్యులు ప్రకటించారు . బీజోన్ ఏరియా ప్రగతికాలనీకి చెందిన వ్యక్తికి కరోనా పాజి టివ్ గా నిర్ధారణ కావడంతో ఆ ప్రాంతాన్ని కట్టడి చేసి ప్రగతికాలనీ వద్ద రెడ్ రిబ్బన్ కట్టిన స్థానికులు  . పాజిటివ్ వచ్చిన వ్యక్తి సింగరేణి ఏరియాసుపత్రిలో పనిచేసే ఉద్యోగి భర్త కావడంతో సిబ్బంది ఆందోళనప డుతున్నారు . సదరు వ్యక్తి ఇంట్లో ఇటీవల ఓ ఫంక్షన్ జరగగా ఆసుపత్రి సిబ్బందితో పాటు స్థానికులు పాల్గొన్నారు . ఏరియాసుపత్రి సిబ్బందితో పాటు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే సిబ్బంది ఇదే కాలనీలో ఉన్నారు . దీంతో ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన రోగులలో ఆందోళన మొదలైంది . కోర్టు కానిస్టేబుల్ తో ప్రారంభమైన కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి . ఇప్పటికే విద్యానగర్ , జ్యోతినగర్ తో పాటు బీజోన్ లోని ప్రగతి కాలనీని కట్టడి ప్రాంతంగా ప్రకటిం చారు . వ్యాపార సముదాయాలు 4 గంటలకే బంద్ చేస్తున్నారు . మాస్క్ లేకుండా బయటకు వచ్చిన వారిపై జరిమానాలు విధిస్తామని  ప్రకటించారు .

Mancherial COVID19 update ::

  టేకులపల్లి గ్రామంలోని పెట్రోలు బంకు యాజమానికి కరోనా పాజి టివ్ రావడంతో గురువారం పెట్రోలు బంకన్ను మూసివేశారు . బంకు యాజమాని బెల్లంపల్లి పట్టణం కాగా కలెక్షన్ కోసం వస్తుంటాడు . దీంతో బంక్ లో పనిచేసే సిబ్బంది ఆరుగురిని అధికారులు హోంక్వారంటైన్ చేశారు . బంక్ లో పెట్రోలు పోయించుకున్న వాహనదారులు ఆందోళన చెందుతున్నారు .

   చెన్నూర్ పట్టణంతోపాటు మండలంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండడంతో పట్టణ ప్రజలతోపాటు మండల వాసులు భయాందోళనకు  గురవుతున్నారు . గురువారం చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా లక్షణాలు ఉన్న 18 మందికి రాపిడ్ టెస్టులు నిర్వహించగా 1మందికి కరోనా పాజిటివ్ వచ్చి నట్లు వైద్యులు సత్యనారాయణ పేర్కొన్నారు . ఇప్పటివరకు చెన్నూర్ తోపాటు మండలంలో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . గురువారం ఎర్రగుంటపల్లి  గ్రామానికి చెందిన ఒకరికి , సోమనపల్లికి చెందిన ఇరువురికి , చెన్నూర్ లో ఐదుగు రికి పాజిటివ్ వచ్చింది . కొత్త బస్టాండ్ ప్రాంతానికి చెందిన ఒక సింగరేణి కార్మికునితోపాటు ఆర్టీసీ కార్మికునికి పాజిటివ్ వచ్చింది .

Related Articles

Back to top button