మంచిర్యాల జిల్లాలో పులి సంచారం, Tiger identified in mancherial district
శ్రీరాంపూర్‌లో పులి కదలికలు అడుగులను గుర్తించిన అధికారులు . Tiger identified in mancherial district, శ్రీరాంపూర్ సింగరేణి జిఎం కార్యాలయ పరిసరాల్లో పెద్దపులి సంచారం దడ పుట్టి స్తోంది . పెద్దపులి కదలికలు స్థానికులను కలవర పెడుతున్నాయి . పక్షం రోజులుగా వివిధ ప్రదేశాల్లో పులి ప్రజలకు కనిపిస్తోంది .
శుక్రవారం ఉదయం శ్రీరాంపూర్ సింగరేణి జిఎం కార్యాలయం ముందు నుంచి జాతీయ రహదారి దాటి అడవుల్లోకి వెళ్తుండగా స్థానికులు , సింగరేణి కార్మి కులు గుర్తించారు . ఈ సమాచారాన్ని పోలీసులు , అటవీ అధికారులకు తెలి యజేశారు . పులి రోడ్డు దాటుతుండగా స్థానికులు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్ చేశారు . ఏక్షణంలో ఎటువైపు నుంచి పులి వస్తుందో నని ప్రజలు ఆందోళన చెందుతున్నారు .
Tiger identified in mancherial district ::
పెద్దపులి ఆచూకీ తెలుసుకునేందుకు అటవీ శాఖ అధికారులు ఐదు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు . శుక్రవారం ఉదయం కనిపించిన పెద్దపులి శ్రీరాంపూర్ మీదుగా ఇందారం వైపు వెళ్ళినట్లు అధికారులు గుర్తించి అక్కడి అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు . రామగుండం సిపి సత్యనారాయణ శ్రీరాంపూర్ చేరుకొని పెద్దపులి పాదముద్రలను గుర్తించారు . ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపులికి ఎలాంటి హాని తల పెట్టవద్దని సూచించారు . వన్యప్రాణి వేటగాళ్లపై ఇప్పటికే కన్నేసి ఉంచామని , అవసరమైతే వారిపై పిడి యాక్టు నమోదు చేస్తామన్నారు . ప్రత్యేక బృందాలతో పెద్దపులి సంరక్షణకు చర్యలు చేపడతామన్నారు . పులి వల్ల ఎవరికీ ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు .
బెల్లంపల్లి , చెన్నూర్ , జైపూర్ , ఆసిఫాబాద్ , కవ్వాల్ , మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో సుమారు నాలుగు పెద్దపులులు స్వేచ్ఛగా తిరుగుతు న్నాయని , లాక్ డౌన్ కారణంగా రాత్రి సమయంలో జనసంచారం లేకపోవడంతో పట్టణాల వైపు వస్తున్నాయన్నారు . ప్రస్తుతం వ్యవసాయ పనులు ప్రారంభమైన నేపథ్యంలో రైతులు ఒంటరిగా పొలాల వైపు వెళ్లవద్దని , పొలాల వద్ద పశువులను కట్టేయరాదని సూచించారు . పెద్దపులికి చిన్న హాని చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు .