భారత్ లో కరోనా కరాళ నృత్యం, India coronavirus cases
భారత్ లో కరోనా కరాళ నృత్యమే చేస్తోంది . India coronavirus cases 2,97,535 సడలింపులు విధించాక దేశ ఆరోగ్య ముఖ చిత్రమే మారిపోయింది . రోజుకు వేయి కేసులు వచ్చే చోట పది వేల కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే పరిణామంగా ఉంది .
శుక్రవారం ఒక్క రోజే ఏకంగా రికార్డు స్థాయిలో 10,956 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దేశంలో కరోనా దూకుడును తెలియ చేస్తోంది . ప్రపంచ దేశాలలో భారత్ కరోనా కేసులతో నాలుగవ స్థానానికి చేరుకోవడం బట్టి చూస్తూంటే కలవరం కలుగుతోంది . ఇలా రోజు రోజుకూ భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది .
India coronavirus cases ::
శుక్రవారం ఒక్కరోజులోనే 396 మంది మృత్యువాత పడ్డారు . దీంతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,97,535 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . ఇప్పటి వరకూ భారత్ లో కరోనా కారణంగా 8,498 మంది మృతి చెందారు . ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది . ప్రపంచంలోనే భారత్ నాలుగో స్థానానికి చేరుకుంది . భారత్ లో మూడు లక్షలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు ఉండటం ఆందోళన కల్గిస్తుంది .
ఇక్కడ ఒక్కటే ఊరటను ఇచ్చే అంశం . అదేంటి అంటే కరోనా మహమ్మారిన పడి కోలుకున్న వారి యాక్టివ్ కేసుల కంటే ఎక్కువగా ఉండడం . శుక్రవారం నాటి కేంద్ర ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం చూసుకుంటే కరోనా యాక్టివ్ కేసులు లక్షా 41 వేల 842 ఉన్నాయి . అదే సమయంలో కరోనా బారిన పడి కోరుకున్నవారు లక్షా 47 వేల 194 మంది ఉన్నారు .