తెలంగాణలో కరోనా విజృంభణ, Corona Cases hike in Telangana
రాష్ట్రంలో కరోనా మరణాలు ఆగడం లేదు . Corona Cases hike in Telangana ఐదు రోజుల్లో ఏకంగా 31 మంది చనిపోవడం ఆందోళన కలిగించే అంశం . ఈనెల 1 వ తేదిన 6 , 2 వ తేది 4 , మూడవ తేదిన 7 , 4 వ తేదీన 6 మందితో పాటు శుక్రవారం మరో ఎనిమిది మంది చనిపోవడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి . ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కువ మంది చనిపోయిన సంఖ్య కూడా ఇదే కావడం గమనార్హం . అయితే మరణిం చిన వారి పూర్తి వివరాలు బులిటెన్లో పేర్కొనలేదు . దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 113 కి పెరి గింది .
Corona Cases hike in Telangana ::
ఇదిలా ఉండగా రాష్ట్రంలో మళ్లీ 143 కరోనా కేసులు నమోదుకాగా , వీటిలో జిహెచ్ఎంసి పరిధిలో 116 మంది ఉండగా , రంగారెడ్డి 8 , మహబూబ్ నగర్ 5 , వరంగల్ 3 , ఖమ్మం 2 , ఆదిలాబాద్ 2 , మేడ్చల్ 2 , సంగా రెడ్డి 2 , కరీంనగర్ 2 , మంచిర్యాల జిల్లాకు చెందిన మరో కరు ఉన్నారు . దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటిన్లు 3290 కి చేరగా , వీటిలో రాష్ట్రానికి చెందిన కేసులు 2842 , ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు 448 మంది ఉన్నారు . వీరిలో 212 విమాన ప్రయాణికులు ఉండగా , 206 మంది వలస కార్మికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు . ఇప్పటి వరకు వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకోని ఆరోగ్యవంతులుగా 1627 మంది ఇళ్లకు చేరగా , ప్రస్తుతం ప్రభుత్వ నోటి ఫైడ్ ఆసుపత్రుల్లో 1550 మంది చికిత్స పొందుతున్నారు . అదే విధంగా వైరస్ దాడిలో ఇప్పటి వరకు 113 మంది మృతి చెందినట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్లో పేర్కొన్నారు .
శుక్రవారం వైరస్ సోకిన వారిలో చార్మినార్ , ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ముగ్గురు కానిస్టేబుళ్లకు వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు . దీంతో పాటు సంగారెడ్డి జిల్లాలో నలుగురు ఎఎన్ఎమ్ కు వైరస్ నిర్ధారణ అయినట్లు సమాచారం . దీంతో క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది మరింత ఆందోళన చెందుతుంది . వాస్తవంగా కోవిడ్ పాజిటివ్ వ్యక్తులను ట్రైసింగ్ చేయడం , పర్యవేక్షించడంలో వీరిది క్రియశీలక పాత్ర . అయితే తాజాగా ఈ విభాగం వారిపై కూడా వైరస్ దాడి చేయడంతో అధికారులు సైతం మనోధైర్యాన్ని కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి.