మంచిర్యాల జిల్లాలో పులి కలకలం, Tiger spoted in mancherial district

బెల్లంపల్లి పట్టణ శివారులో పులి కలకలం రేపింది . Tiger spoted in mancherial district బెల్లంపల్లి స్టేషన్ ఏరియాలోని పెద్దనపల్లి , ఫారెస్ట్ ఆఫీస్ వెనుకాల గల ప్రాంతంలో పులి అడుగులను స్థానికులు గుర్తించి మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత  శ్రీధరకు సమాచారం అందించగా ఆమె వెంటనే స్థానిక అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పులి అడుగు జాడలను గుర్తించారు .

 బెల్లంపల్లి పులి అడుగు పట్టణాన్ని ఆనుకొని ఉన్న ప్రాంతంలో పులి సంచరించడంతో పట్టణమంతా ఉలిక్కిపడింది . గత రెండు , మూడు నెలలుగా బెల్లంపల్లి ఫారెస్ట్ డివిజన్ పరిధిలో పెద్ద పులి సంచరిస్తూ ఇప్పటికే ఒక గేదెను , ఒక ఆవును చంపిన విషయం తెలిసిందే . ఇది ఇలా ఉండగా ఈ ప్రాంతంలో పులి ఒకటా , రెండా అనే అనుమానాలు తావిస్తున్నాయి .

Tiger spoted in mancherial district ::

 ఒకవైపు మాదారం ప్రాంతంలో ఆవును తినగా అదే సమయంలో వేమనపల్లి ప్రాంతంలో మరో ఆవుపై దాడి చేయడం జరిగింది . అదే విధంగా శుక్రవారం రాత్రి పూట బెల్లంపల్లి పట్టణ శివారులో మాదారం అటవీ ప్రాంతంలో పులి సంచరించడంతో ఈ రెండు పులులు తిరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి . బెల్లంపల్లి పట్టణ శివారులో పులి సంచారం విషయం చైర్ పర్సన్ అటవీ అధికారులకు సమాచారం అందించగా సంబంధిత ఫారెస్ట్ రేంజ్ అధికారి మజారోద్దిన్ స్థానికులతో కలిసి పులి అడుగులను గుర్తించి నిర్ధారించారు . అనంతరం ఆయన మాట్లాడుతూ పులి ఎవరికి హాని చేయదని , ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని , చీకటి అయితే బయటకు వెళ్లవద్దని , పులి వచ్చినట్లు కనిపించినా , తెలిసినా అటవీశాఖకు సమాచారం అందించాలని సూచించారు .

Related Articles

Back to top button