రాష్ట్రానికి మిడతల దండు ప్రమాదం ఉంది, problem with Locust

మిడతల దండు మన రాష్ట్రంలోకి దూసుకురాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వెల్లడించారు ( problem with Locust ) మహారాష్ట్ర , చత్తీస్ గఢ్ రాష్ట్ర సరిహద్దులో గల జిల్లాల కలెక్టర్లు , పోలీసు అధికారు లను అప్రమత్తం చేసినట్టు ఆయన  తెలిపారు .

 ఫైర్ ఇంజిన్లు , జెట్టింగ్ మిషన్లు , పెస్టిసైడ్లను సిద్ధంగా ఉంచినట్టు వివరించారు . మిడతల దండు కదలికలను ఎప్పటికప్పుడు గమని స్తూ , అవి రాష్ట్రంలోకి ప్రవేశించకుండా తగు చర్యలను చేపట్టేందుకు వీలుగా ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్టు సీఎం తెలిపారు . మిడతల దండు తెలంగాణ వైపు వస్తే ఎలా వ్యవహరించాలనే విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో గురువారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు .

problem with Locust ::

 దేశంలో వీటి ప్రవేశం , ప్రయాణం , ప్రభావం తదితర అంశాలపై ఆయన చర్చించారు . రాబోయే రోజుల్లో అవి ఎటువైపు వెళ్లే అవకాశం ఉందనే విషయాన్ని ఆరా తీశారు . రాజస్థాన్ ద్వారా మన దేశంలోకి ప్రవేశించిన మిడతలు .. ప్రస్తుతం మహారాష్ట్రలోని భండార , గోండియా మీదుగా మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ వైపు పోతున్నాయని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు తెలిపారు . అక్కడి నుంచి ఉత్తర భారతం మీదుగా ప్రయాణించి పంజాబ్ వైపు పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు .

 గాలివాటం ప్రకారం ప్రయాణించే అలవాటున్న మిడతల దండు ఒకవేళ అదే గాలి దక్షిణం వైపు మళ్లితే చత్తీస్ గఢ్ మీదుగా తెలంగాణ వైపు రావొచ్చని  తేల్చారు . ఇందుకు తక్కువ అవకాశాలున్నప్పటికీ మన రాష్ట్రంలోకి వాటిని ప్రవేశించకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలూ తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు . రాష్ట్ర సరిహద్దుల్లోనే పెద్ద ఎత్తున పురుగుల మందును పిచికారి చేయటం ద్వారా వాటిని సంహరించాలని ఆయన ఆదేశించారు . సమీక్షా సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ , సీఎస్ సోమేశ్ కుమార్ , డీజీపీ మహేందర్ రెడ్డి , ముఖ్య కార్య దర్శులు బి . జనార్ధన్ రెడ్డి , ఎస్.నర్సింగ్ రావు , జయేశ్ రంజన్ , పీసీసీఎఫ్ శోభ , డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి రాహుల్ బొజ్జా , ఫైర్ డీజీ సంజయ్ కుమార్ జైన్ , వ్యవసాయ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్ రావు , సీఐపీఎం ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ . సునీత , వ్యవసాయ యూనివర్సిటీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్ . జె . రహమాన్ తదితరులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు .

Related Articles

Back to top button