ఛత్తీస్ ఘడ్ లో 17మంది జవాన్ లను కాల్చి చంపిన మావోలు, Chattisgarh encounter

ఛత్తీస్ ఘడ్ దండకారణ్యం Chattisgarh encounter రణరంగంగా మారింది . మావోల వ్యూహానికి 17 మంది జవానులు బలికావడం ఛత్తీస్ ఘడ్ పాటు సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ , ఆంధ్ర రాష్ట్రాలలో సంచలనంగా మారింది . భద్రతా బలగాలను తెలివిగా దారిమల్లించి , అంబుష్ చేసిన మావోలు శనివారం అర్ధరాత్రి వారిని మట్టుపెట్టారు .

 ఈ ఘటనలో 17 మంది జవాన్లు హతమైనట్లు పోలీసులు అధికారికంగా ప్రకటించారు . వివరాలలోకి వెళితే  సుక్మాజిల్లా చింతగుఫా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్మాగూడ ప్రాంతంలో మావోయిస్ట్ నేత హిడ్మా ఆధ్వర్యంలో నాగేష్ , వినోద్ , దేవా నేతలతో పాటు 300 మంది నక్సల్స్ సమావేశం అయ్యారని ఛత్తీస్మడ్ నిఘా వర్గాలకు సమాచారం వచ్చింది . దీనితో డోర్నపాల్ ” పోలీస్ స్టేషన్ నుంచి డిఆజ్ , ఎస్టీఎఫ్ కు చెందిన 200 మంది భద్రతా బలగాలను , బుర్కపాల్ క్యాంపు నుంచి మరో 130 మందిని ఆ ప్రాంతానికి కూంబింగ్ ఆపరేషన్ నిమిత్తం పంపించారు .

 శనివారం మధ్యాహ్నం నుండి గాలింపు పూర్తి చేసుకుని భద్రతా బలగాలు తిరుగు పయనమయ్యాయి . అయితే తమఉచ్చులో బలగాలు చిక్కుకున్నాయన్న విషయాన్ని రూడి చేసుకుని నక్సల్స్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు , హెల్మెట్ల ధరించి కసల్ పాడు ప్రాంతంలోని కోర్టా గుట్టలపై నుండి భద్రతా బలగాలను చుట్టుముట్టి ముప్పేటా Chattisgarh encounter జరిపారు .

ఘటన నుండి భద్రతా బలగాలు తేరుకుని ఎదురుకాల్పులు జరిపేలోగానే బలగాలు చెల్లాచెదురయ్యాయి . 14 మంది జవానులు గాయపడగా వారిని అదనపు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని , హెలికాప్టర్ ద్వారా రాయ్ పూర్‌లోని రామకృష్ణకేర్ ఆసువత్రికి తరలించి చికిత్స అందింస్తున్నారు . వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది .

 బలగాలు బయటకు వచ్చాక 17 మంది జవానులు అడవిలో గల్లంతయ్యారని గుర్తించారు . ఆదివారం డ్రోన్ కెమేరాల సాయంతో ఘటన జరిగిన ప్రాంతం నుండి 7 కిలోమీటర్ల దూరంలో పరిశీలించగా 17 మంది జవానుల మృత దేహాలతోపాటు ఇరువురు మావోయిస్ట మృత దేహాలు లభ్యమయ్యాయి . చనిపోయిన వారిలో 12 మంది డిఆర్డి , ఐదుగురు ఎస్టిఎఫ్ సిబ్బంది ఉన్నట్లుగా ధృవీకరించారు .

రాయ్ పూర్ లో చికిత్స పొందుతున్న జవాన్లను ఛత్తీస్ ముడ్ సిఎం ” భూపేష్ వరా మర్శించారు, ఛత్తీస్ ఘడ్ జరిగిన ఎదురుకాల్పులలో మృతి చెందిన జవాన్ల వివరాలను అధికారులు వెల్లడించారు . గీత్ రాం రాఠియా , నారది నిషాద్ , హేమంత ” పోయా , అమర్జిత్ ఖోల్కో , మటకం బుచ్చా , హేమంత్ దాస్ మాణిక్పూరి , గంధం రమేష్ , లిబ్రూ రామ్ బఫేల్ , సోయం రమేష్ , ఉయికా కమలేష్ , పొడియం ముత్తా , ఉయిణధ వా , వంజామ్ నగేష్ , మడకం మాసా , పొడియం లక్మా , మడకం హెడ్మా , నేతేంద్ర బంజామిలు ఎదురుకాల్పులలో మరణించారని అధికారులు పేర్కొన్నారు .

Related Articles

Back to top button