1500 కోసం క్యూలో నిలబడి మహిళ మరణం, Women died in queue line
లాక్ డౌన్ కారణంగా ప్రజల అవసరాల నిమిత్తం ప్రభుత్వం పంపిణీ చేసిన రూ . 1500 నగదు తీసుకునే క్రమంలో Women died in queue line లబ్దిదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు . ఉదయం 8 గంటల నుంచే క్యూలో నిలబడుతున్నారు.
దాదాపు 40 డిగ్రీలకు పైనే ఉన్న మండుటెండ లోనూ మహిళలు బ్యాంకుల ఎదుట క్యూలో నిల్చుంటున్నారు . రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బ్యాంకుల ఎదుట ప్రస్తుతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది . మండుటెండలో గంటలతరబడి క్యూలో నిల్చోవ డంతో పలువురు లబ్దిదారులు తీవ్ర అనారోగ్యం భారిన పడుతున్నారు .
లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం ఖాతాల్లో జమ చేసిన రూ . 1500 నగదును వెంటనే తీసుకోకపోతే ఆ డబ్బు లు వెనక్కి పోతాయని సోషల్ మీడియాలో ఇటీవల జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మిన లబ్దిదారులు పెద్ద ఎత్తున బ్యాంకుల ఎదుట క్యూ కడుతున్నారు .
తాజాగా కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో ప్రభుత్వం తమ ఖాతాలో జమ చేసిన రూ . 1500 నగదును తీసుకునేందుకు బ్యాంకు కి వచ్చిన ఓ మహిళకు నూరేళ్లు నిండిపోయాయి .
క్యూలో నిల్చున్న కన్నాపూర్ తండాకు చెందిన కమల ( 45 ) అనే మహిళ సొమ్మసిల్లిపడిపోయి Women died in queue line ప్రాణాలు కోల్పోయింది . దీంతో క్యూలో నిల్చున్న మహిళలు ఒక్కసారి షాక్ కు గురయ్యారు . తేరుకుని 108కు సమాచారం ఇవ్వగా వారు వచ్చి పరీక్షించి పల్సరేట్ పూర్తిగా పడిపోయిందని తేల్చారు, ఆ కాసేపటికే కమల మృతిచెందింది .
ఆమెకు ఇద్దరు కొడుకులు ఉన్నా రు . ఆమె కొంత కాలంగా అనా రోగ్యంతో బాధపడుతోందని ఆమె కుమారుడు తెలిపారు . అనంతరం ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఇ రాజు తెలిపారు . సంఘటన స్థలంలో వీఆర్వో మోహన్ , సర్పంచ్ చందర్ నాయక్ , సంజీవ్ కుమార్ , గ్రామపెద్దలు ఉన్నారు .