తెలంగాణలో కరోనా విజృంభణ,ఒకే రోజు 61 కేసులు, 61 carona cases in TS

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తోంది 61 carona cases in TS . వ్యాధి తగ్గుముఖం పట్టిందని అంచనా వేస్తున్న తరుణంలో ఏకంగా ఈ మహమ్మారి సోకి సోమవారంనాడు కొత్తగా 61 పాజిటివ్ కేసులు నమోద య్యాయి.

 61 carona cases in TS ఇన్ని కేసులు నమోదు కావడంతో అధికార యంత్రాంగం హడలెత్తిపోతోంది . ఇప్పటికే ఈ వ్యాధి సోకి 16 మంది మృత్యువాత పడగా తాజా మరొకరు కన్నుమూశారని ఈ సంఖ్య 17కు చేరిందని వైద్య , ఆరోగ్యశాఖ ఓ బులిటెన్లో పేర్కొంది .

 ఇప్పటి దాకా ఈ కరోనా వైరస్ బారిన పడినవారి సంఖ్య 472 కాగా ఆసుపత్రుల్లో చికిత్స పొంది నయమైన 108 మందిని వారి నివాసాలకు పంపించారు . హైదరాబాద్ పరిధిలో కరోనా పాజి టివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి .

 పాత బస్తీ, చార్మినార్ భవానీ నగర్ ప్రాంతంలో ఒకే ఇంట్లో 17 మందికి కరోనా సోకడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు . ఒక్క హైదరాబాద్లోని 216 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని , ఈ సంఖ్య రెండు మూడ్రోజుల్లో మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు . 

హైదరాబాద్  తర్వాత నిజామాబాద్లో అత్యధికంగా 35 కేసులు నమోదయ్యాయి . జిల్లాల వారీగా చూస్తే వికారాబాద్ లో 24 , రంగారెడ్డిలో 20 , వరంగల్ అర్బన్ 21 , జోగులాంబగద్వాల – 20 , సూర్యా పేట 20 , మేడ్చల్ – 18 , నిర్మల్ 18 , కరీంనగర్ 4 , నల్గొండ 12 , ఆదిలాబాద్ – 11 , మహబూబ్నగర్ – 10 , కామారెడ్డి – 8 , ఖమ్మం – 7 , సంగారెడ్డి – 6 , మెదక్ – 3 , భద్రాద్రి కొత్తగూడెం – 2 , జయశంకర్ భూపాలపల్లి – 3 , కొమరంభీం – 8 , నాగర్ కర్నూలు – 2 , జగి త్యాల – 2 , ములుగు – 2 , పెద్దపల్లి – 2.

 మహబూ బాబాద్ , సిద్దిపేట , రాజన్నసిరిసిల్ల జిల్లాల్లో ఒక్కో పాజిటివ్ కేసు ఇప్పటిదాకా నమోదయ్యాయి . రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం వరకు 472 పాజిటివ్ కేసులు నమోదు కాగా 108 మందిని డిశ్చార్జి చేసినట్లు ఆ బులిటెన్లో పేర్కొంది.

 రాష్ట్రంలో ఇప్పటిదాకా నిర్వహించిన ఇంటింటి సర్వేలో భాగంగా 6 , 41 , 194 ఇళ్లను సర్వే చేసి 27 , 32 , 644 మందిని పరీక్షించామని అధికారులు తెలిపారు.

Related Articles

2 Comments

Back to top button