తెలంగాణలో 6 కొత్త కేసులు, 6 మరణాలు, 6 people died, 6 new cases in TS
రాష్ట్రంలో కొత్తగా 6 new cases in TS కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . తెలంగాణలో ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందినట్టు ప్రభుత్వం ప్రకటించింది . మార్చి 11- 15 మధ్య ఢిల్లీ నిజాముద్దీన్ పరిధిలోని మర్కజ్ లో మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా వైరస్ సోకింది.
6 new cases in TS మరియు తెలంగాణకు చెందిన ఆరుగురు మృతి చెందారు . గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు , అపోలో , గ్లోబల్ ఆస్పత్రుల్లో ఒక్కొక్కరు . నిజామాబాద్ , గద్వాల జిల్లాల్లోనూ ఒక్కొక్కరు చొప్పున మరణించారని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది .
ఢిల్లీలో మతపరమైన ప్రార్ధనల్లో పాల్గొని తెలంగాణకు వచ్చిన వారినుంచి వైరస్ సోకే అవకాశముందని భావిస్తున్న అనుమానితులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు . ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి . అనుమానితులకు పరీక్షలు నిర్వహించి వైద్యమందిస్తున్నారు . మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి కరోనా వైరస్ సోకినట్టు తెలుస్తోంది .
ఈ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు విధిగా తమ సమాచారాన్ని అధికారులకు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ విజ్ఞప్తిని చేస్తోంది . వారి గురించి ఎవరికి సమాచారం తెలిసినా వెంటనే ప్రభుత్వానికి తెలియజేయాలని కోరుతోంది . ఇదిలా ఉండగా గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ కేంద్రంలో చికిత్స పొందుతున్న 12 మంది కరోనా వైరస్ బాధితులు సోమవారం డిశ్చార్జి అయ్యారు .
ఇప్పటికే రాష్ట్రంలో నమోదైన తొలి కేసు కరోనా బాధితుడికి నెగిటివ్ రిపోర్ట్ రావడంతో ఆయనను వైద్యులు ఆస్పత్రి నుంచి ఇంటికి పంపించిన విషయం తెలిసిందే . సోమవారం ఆస్పత్రి నుంచి 11 మంది బాధితులు డిశ్చార్జి అవుతున్నట్లు స్వయంగా సీఎం కేసీఆర్ ఆదివారం మీడియా సమావేశంలో ప్రకటించిన విషయం తెలిసిందే .
కొత్తగా నమోదైన ఆరు పాజిటివ్ కేసుల్లో కరీంనగర్‌కు చెందిన ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా , మిగతా నలుగురు వివిధ ప్రాంతాలకు చెందిన వారున్నారు . రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ అని తేలిన బాధితుల్లో 61 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు .
దీంతో రాష్ట్రంలో మొత్తం 77 పాజిటివ్ కేసులు నమోదయ్యా యి .