తెలంగాణలో ఏప్రిల్ 7 తర్వాత కరోనా కథం, 11 patients discharged in Telangana

తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో లో కరోనా వైరస్ పరిస్తితి పై సమీక్ష నిర్వహించి 11 patients discharged in Telangana ఏప్రిల్ 7 తర్వాత కరోనా రహిత తెలంగాణ మారుతుందన్నారు,  రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టిందని , గాంధీ ఆస్పత్రి నుంచి కోలుకున్న 11 మంది రోగులను నేడు డిశ్చార్జ్ చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కె . చంద్రశేఖరరావు తెలిపారు .

వీరితో పాటు క్వారెంటైన్లో ఉన్న మరో 1,899 మంది అనుమానితులను నిర్బందం నుంచి విముక్తి కల్పిస్తున్నామని పేర్కొన్నారు . 14 రోజులపాటు డాక్టర్ల పర్యవేక్షణ పూర్తిచేసుకునీ ఆరోగ్యంగా ఉన్న అందరినీ విడుదల చేస్తున్నామని ప్రకటించారు.

ఏప్రిల్ 7వ తేదీ తరవాత తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితులు ఉండరని ముఖ్యమంత్రి కె . చంద్రశేఖరరావు ప్రకటించారు . రాష్ట్రంలో కొత్త కేసులు వచ్చే అవకాశం లేదనీ , కొత్తగా ఎవరికీ సోకకపోతే వచ్చే నెల 7నాటికి కరోనా ఫ్రీ తెలంగాణ ఆవిర్భావమవుతుందని ఆయన వివరించారు .

అధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు . ఇప్పటి వరకూ రాష్ట్రంలో 70 కరోనా కేసులు నమోదయ్యాయని చెప్పారు . వారిలో 11 patients discharged in Telangana మందికి ఆదివారం నిర్వహించిన పరీక్షలలో నెగటివ్ అని నివేదిక వచ్చిందని తెలిపారు . వీరంతా సోమవారం నాడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని వెల్లడించారు . 

ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ స్పందిస్తూ  తెలంగాణలో కరోనా పాజిటివ్ గా తేలిన 11మందికి తాజా టెన్ల నెగిటివ్ వచ్చిందని , ఈ విషయాన్ని మీతో పంచు కోవడం సంతోషంగా ఉందని మునిసిపల్ , ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఆదివారం సాయంత్రం ట్వీట్ చేశారు .

కరోనా బాధితులకు చికిత్సను అందించేందుకు కింగ్ కోఠిలో ఏర్పాటు చేసిన 350 పడకల ఆస్పత్రి ఫొటోలను మంత్రి షేర్ చేశాడు . కరోనా బాధితుల కోసం హైదరాబాద్లో మరో నాలుగు ఆస్పత్రులు సిద్ధం చేస్తున్నామని తెలిపారు . జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్నపూర్ణ క్యాంటీన్లో మధ్యాహ్న భోజనం , రాత్రి భోజనం ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించారు .

జీహెచ్ఎంసీ పరిధిలో 145 మొబైల్ రైతుబజార్లు , 150 అన్నపూర్ణ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు . పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం మాస్క్లు , శానిటైజర్లు , డ్రెస్ కోసం నిరంజన్ రావు అనే వ్యక్తి రూ . 5 లక్షలు మేయర్ బొంతు రామ్మోహనకు అందించగా , నిరంజన్‌రావును మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా అభినందించారు .

Related Articles

Back to top button