కాంగ్రెస్ లో కుమ్ములాట, ఇంతకీ పీసీసీ ఎవరికంటే.. TPCC war in Tcongress

టిపిసిసి అధ్యక్ష పదవి ఎంపిక ప్రక్రి యతో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు వేడెక్కాయి . TPCC war in Tcongress ఒక వర్గం రేపో , మాపో రేవంత్ రెడ్డినే అధ్యక్షునిగా ప్రకటిస్తారని ప్రచారం చేస్తుండగా , ఆయనను వ్యతిరేకిస్తున్న వాళ్లలో కొందరు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు . కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హన్మంతరావు ఏకంగా రేవంత్ ను టిపిసిసి అధ్యక్షుడిని చేస్తే తాను పార్టీని వీడిపోతా నిని హెచ్చరికలు చేశారు . సహచర పార్టీ నేతలు మల్లు రవి , షబ్బీర్ అలీతో పాటు ఇన్ ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ పై కూడా ఆరోపణలు గుప్పించారు .

మరోవైపు ఏకాభిప్రాయ సాధన ద్వారానే అధ్యక్ష ఎంపిక జరగాలని , అలా కాకుండా లాబీయింగ్ ద్వారా ఎవరైనా అధ్యక్షుడైతే తన స్వంత ప్రణాళిక ఉన్నదని ఎంఎ జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు . తాజాగా నాగార్జునసాగర్ ఉప ఎన్నిక వరకు ఉత్తమ్ నే కొనసాగించాలని సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకువ చ్చారు . కాంగ్రెస్ పార్టీలో కొత్త అధ్యక్షుని ఎంపిక ప్రక్రియ సందర్భంగా ఇలా హాట్ హాట్ పరిణామాలు చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి . TPCC war in Tcongress గతంలో అధిష్టానం కొందరు ముఖ్య నాయకుల అభిప్రాయాలను పిలి పించుకొని విడివిడిగా అభిప్రాయాలు తెలుసుకొని అకస్మాత్తుగా ప్రక టన చేసేవారు . కాని ఈసారి తొలిసారిగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల్ ఇన్‌ఛార్జ్ జిల్లా స్థాయి వరకు అభిప్రాయాలు తీసుకోవడంతో , అధ్య క్షుడు ఎవరనే ఆసక్తి అందరిలో నెలకొంది . ఈ నేపథ్యంలో ఫలానా వారికి ఇవ్వాలని , వద్దని బాహాటంగా ప్రకటనలు వెలువడుతుండడం గమనార్హం .

ఇదిలా ఉండగా రెండు మూడు రోజులగా ఢిల్లీలో ఉన్న పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి , వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తిరిగి రాష్ట్రానికి రాగా , సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క , ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి , ఎఐసిసి కార్యదర్శి మధు యాష్కీగౌడ్ ఢిల్లీలోనే ఉన్నారు . కాగా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ ప్రాథ మిక నివేదిక అధిష్టానానికి పంపారని , పూర్తి నివేదిక ఇచ్చేందుకు మరి కొంత సమయం పడుతుందని సమాచారం . పిసిసి అధ్యక్షునితోపాటు ఆరు రకాల కమిటీలకు కూడా పేర్లు సూచించాలని రాహుల్ గాంధీ సూచించడంతో ఆయన ఆ పనిలో నిమగ్నమైనట్లు తెలిసింది . ఇదిలా ఉండగా , ప్రస్తుతం ఈ నెల 28 న జరిగే కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్స వంలో కాంగ్రెస్ నేతలు బిజీగా ఉన్నారు . ఆ తరువాత జనవరి మొదటి వారంలో పిసిసి కమిటీలకు సంబంధించిన కొన్ని కమిటీల ప్రతిపాద నలు రాష్ట్రంలోని కోర్ కమిటీ నేతలకు పంపి , మార్పులు చేర్పులు కోర తారని పార్టీ వర్గాల సమాచారం . అదంతా పూర్తయ్యాక పిసిసి అధ్యక్షు నితో పాటు కొత్త కమిటీలను కూడా ప్రకటించనున్నట్లు తెలిసింది .

Related Articles

Back to top button