వెనకడుగు వేసిన సీఎం కేసిఆర్, KCR decision on rythu bandhu

దేశానికే ఆదర్శం అన్న పథకంపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది . KCR decision on rythu bandhu నియంత్రిత సాగు పద్ధతులు పాటించడం అంత తేలికైన విషయంగా ప్రభుత్వం భావించడం లేదు . ఒక ఖరీఫ్ సీజన్క ప్రభుత్వానికి చుక్కలు కనబడినట్లు సమాచారం . మద్దతు ధర ప్రకారం రైతుల వద్ద కొనుగోలు చేసిన వ్యవసాయ ఉత్పత్తులు తిరిగి విక్రయించే పరిస్థితి లేకపోవడం వందల కోట్ల రూపాయలు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు కేటాయించడం గోదాముల సమస్యల వెరసి ప్రభుత్వం నియంత్రిత సాగుపై పునరాలోచనలో పడింది . ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభం నుంచి ప్రభుత్వం నియంత్రిత సాగును అమలులోకి తెచ్చింది .

వాతావరణ పరిస్థితులు , మార్కెటింగ్ సదుపాయం తదితర విషయాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఏ పంట వేయాలో సూచిస్తుంది . ప్రభుత్వం సూచించిన పంటలను సాగు చేసినా రైతుల వద్ద నుండి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది . ఖరీఫ్ సీజన్లో మొక్కజొన్న పంట సాగు చేయరాదని వరిలో కూడా సన్న రకాలు , పత్తి , అపరాలు సాగు చేయాలని సూచించారు . వాతావరణ పరిస్థితులు సానుకూలంగా లేకపోవడం , అతివృష్టి కారణంగా పత్తి పంట ఘోరంగా దెబ్బతిన్నది . ఖరీలో పండిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం వద్ద తగిన అవకాశాలు లేవు . గతేడాది యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యం , మొక్కజొన్నలతో గోదాములు నిండిపోయాయి . దాదాపు రూ . 800 కోట్లతో వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసిన ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు , ఇతరత్రా కారణాలతో వెనకడుగు వేసింది .

KCR decision on rythu bandhu

ఆదివారం వ్యవసాయ శాఖ , మార్కెటింగ్ శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన అనంతరం నియంత్రిత సాగుపై ప్రభుత్వం వెనకడుగు వేసినట్లు సమాచారం . రైతులు ఎవరు ఇష్టం వచ్చిన పంట వారు వేసుకోవచ్చునని ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు కల్లాలు , ఇతర వనరులను ఉపయోగించుకుని వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించుకోవాలని సూచించినట్లు సమాచారం . దీనిపై నేడో , రేపో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది . దేశానికే ఆదర్శమని దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం చేయలేని పనిని తాము చేశామని జబ్బలు చరుచుకున్న ప్రభుత్వం ఏడాది తిరక్క ముందే పునరాలోచనలో పడడం గమనార్హం . ఇప్పుటికిప్పుడు కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తే రైతులు ముఖ్యంగా వరి పండించిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది . ఖరీఫ్ లో పండించిన వడ్లను మద్ధతు ధర ప్రకారమే ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు .

నేటి నుంచి ‘ రైతుబంధు ‘ ఈనెల 28 వ తేదీ నుంచి జనవరి వరకు రాష్ట్రం లోని రైతులందరికీ రైతుబంధు పథకం కింద ఆర్థిక సహాయం అందించనున్నట్లు రాష్ట్ర ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు . మొత్తం 61.49 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములకు ఎకరానికి రూ .5 వేల చొప్పున 2020 యాసంగి సీజన్ కోసం ప్రభుత్వం రూ . 7,515 కోట్ల పంట సాయంగా అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడిం చారు . రాష్ట్రంలోని ఏ ఒక్క రైతూ మిగలకుండా ప్రతి ఎకరానికి డబ్బులు నేరుగా బ్యాంకులో జమ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశిం చారు .

Related Articles

Back to top button