సంచలనం సృష్టించిన బీజేపీ, BJP created history
BJP created history కేంద్రపాలిత ప్రాంతంగా స్థాయి దిగజారిన జమ్మూ – కశ్మీర్ లో ఆర్టి కల్ 370 రద్దు తదుపరి జిల్లా అభివృద్ధి మండళ్లకు ( డిడిసిలు ) తొలి సారి జరిగిన ఎన్నికల్లో ఏ పక్షానికి ఎన్ని సీట్లు దక్కాయనే విశ్లేషణ కన్నా , సగటున 51 శాతం పైగా ప్రజలు ఓటు హక్కు వినియోగించు కోవటం విశేష ప్రస్తావనాంశం . రాష్ట్రానికి రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రత్యేక ప్రతిపత్తిని గత సంవత్సరం ఆగస్టులో రద్దు చేసి , రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన మోడీ ప్రభుత్వ చర్య పట్ల నిరసన , అసంతృప్తి కవైపు , ఎన్నికలను భగ్నం చేసేందుకు లోయలోని నాలుగు జిల్లాల్లో మిలిటెంట్స్ ప్రయత్నాలు మరోవైపు , బిజెపి పాకిస్థాన్ వ్యతిరేక ప్రచారం , ‘ అభివృద్ధి మంత్రం , భద్రతాద కాల భారీ మోహరింపు మధ్య ఓటర్లు చూపిన ఉత్సాహం ప్రజాస్వా మ్యానికి విజయంగా భావించవచ్చు . అయితే ఫలితాలను సార్వత్రిక రించటం తప్పు నిర్ధారణలకు దారితీస్తుంది .
ముస్లిం మెజారిటీ కశ్మీర్ లోయ , హిందూ మెజారిటీ జమ్ము మధ్య దీర్ఘకాలంగా ఉన్న ఓటర్ల విభజన అలాగే కొనసాగుతున్నట్లు ఈ ఎన్నికల ఫలితాలు విదితం చేస్తున్నాయి . కశ్మీర్ లో తొలిసారి మూడు సీట్లు గెలిచినం దుకు బిజెపి చంకలు చరుచుకోవచ్చు . కాని జమ్ములో కూడా ప్రతిప క్షాలు కొన్ని సీట్లు గెలిచాయి . కశ్మీర్ లోయలో అరడజను పార్టీలతో ఏర్పడిన గుహ కార్ అలయెన్స్ అత్యధిక సీట్లు గెలుపొందగా , జమ్ములో బిజెపి ఎక్కువ సీట్లు గెలిచింది . ఆర్టికల్ 370 , రాష్ట్ర ప్రతి పత్తి పునరుద్ధరణ డిమాండ్ తో నేషనల్ కాన్ఫరెన్స్ , పిడిపి , పీపుల్స్ కాన్ఫరెన్స్ , సిపిఎం , జెకె పీపుల్స్ మూవ్ మెంట్ , సిపిఐలతో గుప్ కార్ అలయెన్స్ ఏర్పడటం తెలిసిందే . ఈ కూటమిలో చేరిన కాంగ్రెస్ , బిజెపి నిందారోపణల కారణంగా దాన్నుండి వైదొలిగి స్వతంత్రంగా పోటీ చేసింది .
BJP created history ::
మొత్తం 20 జిల్లాల్లో – ఒక్కొక్క జిల్లాకు 14 సీట్లతో ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ధి కౌన్సిల్స్ లోని మొత్తం 280 సీట్లకు నవంబర్ 28 నుంచి డిసెంబర్ 19 వరకు 8 అంచెల్లో కె ఎన్నికల కమిషన్ భారీ బందోబస్తు మధ్య నిర్వహించిన ఎన్నికల్లో 278 ఫలితాలు వెల్ల డైనాయి . 2 సీట్లలో ఓట్ల లెక్కింపు వాయిదా పడింది . అక్కడ పోటీ చేసిన అభ్యర్థుల్లో ఇద్దరు మహిళలు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరు చెందినవారని , వారు లోగడ మిలిటెంట్లను వివాహమాడి ఇక్కడ నివాసం ఉంటున్నారన్నది ఫిర్యాదు . గుప్ కార్ డిక్లరేషన్ ఫర్ పీపుల్స్ అలయెన్స్ ( పిఎజిడి ) 110 సీట్లు గెలుచుకోగా , బిజెపికి 75 సీట్లు లభించాయి . అయితే జమ్ములో పోలింగ్ శాతం హెచ్చుగా ఉన్నం దున బిజెపికి పీపుల్స్ అలయెన్స్ కన్నా 93 వేలు ఎక్కువ ఓట్లు లభిం చాయి . కాగా ఇండిపెండెంట్లు 50 , కాంగ్రెస్ 26 , అప్నీ పార్టీ 12 , పిడిఎఫ్ 2 , పాంథర్స్ పార్టీ 2 , బిఎపి 1 సీటు గెలుపొందాయి . పిఎ జిడికి 6 జిల్లాల్లో , బిజెపికి 5 జిల్లాల్లో స్పష్టమైన మెజారిటీ లభిం చింది .
మరో 6 జిల్లాల్లో పిఎజిడికి ఒకటి , రెండు సీట్లే తగ్గినందున కాంగ్రెస్ తోడ్పాటుతోనో , ఇండిపెండెంట్లను కలుపుకునే ఆ పార్టీలే పాలక మండళ్లు ఏర్పాటు చేసే అవకాశముంది . పిఎజిడి భాగస్వా ముల్లో అబ్దుల్లాల నేషనల్ కాన్ఫరెన్స్ కు 67 , మెహబూబ ముస్లి పిడి పికి 27 , పీపుల్స్ కాన్ఫరెన్స్ కు 8 , సిపిఎంకు 5 , పీపుల్స్ మూవ్మెం టకు మూడు సీట్లు లభించాయి . పిఎజిడికి 3.94 లక్షల ఓట్లు ( 32.96 శాతం ) , బిజెపికి 4.87 లక్షల ఓట్లు ( 38.74 శాతం ) , కాంగ్రెస్ కు 1.39 లక్షల ఓట్లు , ఇండిపెండెంట్లకు 1.71 లక్షల ఓట్లు లభించాయి . తమ పార్టీ ఏకైక పెద్ద పార్టీగా సీట్లు పొందినందున ఆర్టికల్ 370 రద్దును , రాష్ట్ర విభజన , ప్రతిపత్తి తగ్గింపును ఓటర్లు సమర్థించారని బిజెపి చెప్పుకున్నా , లేక తమకు అత్యధిక సీట్లు ఇవ్వటం ద్వారా ఆ చర్యలను ఓటర్లు తిరస్కరించారని పిఎజిడి పార్టీలు వాదించినా అవి రెండూ సత్యదూరమైనవే అవుతాయి . ప్రజల మనోభావాలు ప్రాంతా లవారీ ఎప్పటివలె స్థిరంగా ఉన్నట్లు విదితమవుతున్నది .
BJP created history ::
ఇవి కేవలం స్థానిక పరిపాలనా ఎన్నికలయినందున ఆయా జిల్లాల అభివృద్ధి కృషి అందరికీ ప్రధానాంశం . అక్కడి ప్రత్యేక పరిస్థితుల్లో రాజకీయ అంశాలపై ప్రచారమూ జరిగింది . ఆర్టికల్ 370 రద్దు తదుపరి తీవ్ర మైన నిర్బంధాలకు గురిచేయబడిన ప్రతిపక్ష పార్టీలు ఈ ఎన్నికల్లో పాల్గొనటం ద్వారా , తమపై వేర్పాటువాదులుగా , పాకిస్థాన్ అనుకూ లురుగా బిజెపికి చేస్తున్న నిందా ప్రచారాన్ని తిప్పికొట్టాయి . ఆర్టికల్ 370 రద్దును వెనక్కి తీసుకోవాలన్న మనోభావం బలంగానే ఉన్నప్ప టికీ , అది ముగిసిన అంశమే . కనీసం రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరణ ఆవశ్యకం , ఇప్పుడు కావలసింది కేంద్ర ప్రభుత్వం జమ్మూ – కశ్మీర్ ప్రజలతో , వారి ప్రతినిధులైన రాజకీయ పార్టీలతో సుహృద్భావ చర్చలు ; వారిలో ఉన్న అసంతృప్తిని , అనుమానాలను నివృత్తి చేయటం . వారి జాతీయతాభావాన్ని శంకిస్తూ , వేర్పాటు వాదులుగా ముద్రవేసే బిజెపి వైఖరి సామరస్యం పెంపొందించేందుకు తోడ్ప డదు . టెర్రరిజం , మిలిటెన్సీల నేపథ్యం వేరు కాబట్టి అవి కొనసాగు తూనే ఉంటాయి . వాటితో స్థానిక పార్టీలను ముడివేయటం ప్రజల్లో పరాయీకరణ భావాన్ని పటిష్టం చేస్తుంది . రాజకీయ పార్టీల సహకారం లేకుండా కేంద్రం ఏకపక్షంగా సాధారణ పరిస్థితులను నెలకొల్పజాలదు .